ఎస్ఐ రామకృష్ణపై దాడి, దాడిలో కానిస్టేబుల్ రామారావుకు కూడా గాయాలు

Spread the love

Attack on SI Ramakrishna, Constable Rama Rao also got injured in the attack

ఎస్ఐ రామకృష్ణపై దాడి, దాడిలో కానిస్టేబుల్ రామారావుకు కూడా గాయాలు. అనవసరవిషయాల్లో జోక్యం కలగజేసుకొని దుర్భాశాలాడగా అగ్రహించిన గ్రామస్తులు యువకులు దాడికి పాల్పడ్డారు.దాడిచేసిన గ్రామస్తులను, యువకులను పోలీసుస్టేషన్ కు తరలిస్తుండగా మహిళలు బైటయించడంతో మెల్లగా జారుకున్న పోలీసులు.

శ్రీకాకుళం జిల్లా,ఇచ్చాపురం మండలం,లొద్దపుట్టి గ్రామంలో ఇచ్చాపురం రూరల్ ఎస్ఐ రామకృష్ణ పై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు.గ్రామంలో తగాదావిషయమై గ్రామస్తులు, పెద్దలు చర్చించుకోవడానికి సభ ఏర్పాటు చేసుకోగ అనవసరంగా పోలీసులు మధ్యలో జోక్యం కల్పించుకొని దుర్భాశాలాడగా అగ్రహించిన గ్రామస్తులు ముకుమ్మడి దాడిచేసారు.ఈ దాడిలో ఎస్ఐ రామకృష్ణకు, కాన్స్టేబుల్ రామారావుకు గాయాలయ్యాయి. గ్రామంలో చిన్నచిన్న తగాదాలకు పోలీసులు అనవసరజోక్యం కలగజేసుకొని మందలించేవారని,తమ గ్రామప్రజానీకానికి,యువతకు వర్ణించడానికి వీలులేని భాషలో దుర్భాలతో దుషించే సరికి యువకులు కట్టలుతెంచే ఆవేశంతో దాడిచేసినట్లు గ్రామస్తులు తెలిపారు. దాడిచేసిన యువకులను పోలీసుస్టేషన్ కు తరలించే ప్రయత్నం చేయగా మహిళలు బైటయించడంతో మెల్లగా జారుకున్నారు.

Related Posts

You cannot copy content of this page