తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

Spread the love

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

  • జైలుకు వెళ్ళిన నేతలను నిజమైన వీరులు, హీరోలన్న నారా లోకేష్
  • టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన నారా లోకేష్ చిత్తూరు జిల్లా పర్యటన
  • చంద్రబాబు లేఖకు స్పందించి వేధింపులు నిలిపివేయాలి
  • రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టండి
  • టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్
    సాక్షిత గుడివాడ : కుప్పం ఘటనలో పార్టీ కోసం జైలుకు వెళ్ళిన టీడీపీ నాయకులు, కార్యకర్తలను నిజమైన వీరులు, హీరోలుగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభివర్ణించారని, నారా లోకేష్ చిత్తూరు జిల్లా పర్యటన టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ అన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో శిష్ట్లా లోహిత్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కుప్పంలో అన్నా క్యాంటీన్ పై వైసీపీ గూండాలు రెండుసార్లు దాడులు చేయడాన్ని నారా లోకేష్ తీవ్రంగా ఎండగట్టారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుందన్న భరోసాను నారా లోకేష్ ఇచ్చారన్నారు. కుప్పంలో అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేసినప్పటికీ చంద్రబాబు మాత్రం పేదలకు స్వయంగా భోజనాన్ని వడ్డించారని చెప్పారు. ఇదిలా ఉండగా చంద్రబాబు బహిరంగ లేఖకు ప్రభుత్వం స్పందించి ఉద్యోగులపై కేసులు, వేధింపులను నిలిపివేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ ను రద్దు చేస్తానని ముఖ్యమంత్రి జగన్ వాగ్దానం చేశారన్నారు. మూడేళ్ళు గడిచినా రద్దు చేయకపోవడం వల్ల ఉద్యోగులు నిరసనలు చేస్తున్నారన్నారు. శాంతియుతంగా నిరసనలు చేయడం ఉద్యోగులకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా అభివర్ణించారు. శాంతియుత నిరసనను ఈ నెల 1 వ తేదీ నుండి 11 వ తేదీకి వాయిదా వేసుకున్నారని, అయినప్పటికీ ఉద్యోగులపై వేధింపులు, నిరసనలు కొనసాగుతున్నాయంటూ చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఎన్నడూ ప్రభుత్వ ఉద్యోగులపై ఈ తరహా వేధింపులకు పాల్పడలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా ఇతర దేశాలకు తరలిపోతోందని ఆరోపించారు. రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి మళ్ళీ అమ్ముకోవడం ద్వారా వేల కోట్ల కుంభకోణానికి తెర లేపారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యాన్ని గత ఏప్రిల్ నుండి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం అర్హులైన తెల్లరేషన్ కార్డుదారులందరికీ సక్రమంగా ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని శిష్ట్లా లోహిత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

Related Posts

You cannot copy content of this page