పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన యస్.పి రాజేంద్ర ప్రసాద్

Spread the love

కేసులలో సమగ్ర విచారణ చేపట్టి చట్టపరంగా నేరస్థులకు శిక్ష పడేవిధంగా కృషి చేయాలి
పెండింగ్ పనుల వల్ల వత్తిడి పెరుగుతుంది, పనులు పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలి.
సూర్యాపేట సాక్షిత ప్రతినిధి


జిల్లా పోలీస్ కార్యాలయంలో
యస్.పి రాజేంద్ర ప్రసాద్ ఐపిఎస్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యస్.పి మాట్లాడుతూ
జిల్లా లో నమోదు అవుతున్నా అయా కేసులలో అధికారులు పకడ్బదీగా పారదర్శకంగా విచారణ చేపట్టాలని, అందుకు క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ను పెంపొందించుకోవాలని పోలీస్ అధికారులకు తెలియజేశారు.
జిల్లాలోని అన్ని పోలీస్టేషన్లలో పెండింగులో ఉన్న కేసుల వివరాలను, యు ఐ కేసులను సమీక్షించి పెండింగ్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగులో ఉన్న కేసులను సత్వరమే పరిష్కారానికి కృషి చేయాలని పోలీసు అధికారులను
ఆదేశించారు.

పనులు పెండింగ్ ఉంచడం వల్ల పని వత్తిడి పెరుగుతుంది, కావున ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. కేసులు విచారణలో నిర్లక్ష్యం చేయవద్దు, ప్రణాళిక తో
పనిచేయాలి అన్నారు. కేసుల విచారణలో బాధితుల, సాక్షుల, నిందితుల వాగ్మూలం ఎస్ ఓ పి ప్రకారం నమోదు చేయాలి, కేసు దస్త్రాలు ఫైల్ చేయుట, పోటో స్ , ప్రాపర్టీ సీజ్, నిందితుల వివరాలు ఎంట్రి చేయట, రిమాండ్ డైరీ చార్జి షీట్ ఫైల్ల్ చేయుట తదితర అంశాల పై సమీక్షించి ఎస్ ఐ లకు తగు సూచనలు చేశారు. నేరాల నియంత్రణలో చేదనలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. 5ఎస్ విధానంలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా చూసుకోవాలని.
అనంతరము పోలీస్ వాహనాలను ఇన్స్పెక్షన్ చేశారు. పోలీస్ వాహన డ్రైవర్లతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వాహనాల మెకానిజం పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో డిఎస్పీ లు నాగభూషణం, వెంకటేశ్వర రెడ్డి, డిసి ఆర్ బి డిఎస్పీ రవి, సీఐ సోమ్ నారాయణ్ సింగ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీసి ఆర్ బి ఇన్స్పెక్టర్ నర్సింహ, సీఐ లు ఆంజనేయులు, రామలింగారెడ్డి రాజశేఖర్, శివ శంకర్, వీర రాఘవులు, రామకృష్ణా రెడ్డి, ఆర్ ఐ లు శ్రీనివాస రావు, గోవిందరావు, శ్రీనివాస్, నర్సింహారావు,
ఎస్ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page