జిన్నారం గ్రామపంచాయతీ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి కి గ్రామపంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మార్కెట్ స్థలాన్ని యధాస్థితిలో ఉంచాలని వినతిపత్రం ఇవ్వడం. జరిగింది. ఇంతకుముందు మార్కెట్ జరిగే స్థలం ఎక్కడుందో అక్కడ పెట్టాలని వ్యాపారస్తులు గ్రామస్తులు నాయకులు మార్కెట్ జరపాలని తెలిపారు. గత కొంతకాలంగా మార్కెట్ వేరే స్థలానికి వెళ్లడం వల్ల షాపు యాజమాన్యులు తీవ్ర నష్టాలు జరుగుతున్నాయని వ్యాపారం జరగక కస్టమర్లు రాలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని షాపు భవనాలకు కిరాయి కట్టే పరిస్థితిలో లేవని ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి వెంటనే మార్కెట్ స్థలాన్ని మెయిన్ రోడ్ లో ఏర్పాటు చేయాలని అలా చేయడం వల్ల మార్కెట్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు
చుట్టుపక్కల గ్రామాలలో కొత్తగా మార్కెట్ ఏర్పాటు చేసుకొని తక్కువ సమయంలో ఆయా గ్రామాల అభివృద్ధి చెందుతుందని మన గ్రామ మార్కెట్ మాత్రం అనేక సంవత్సరాల నుండి జరుగుతున్న కూరగాయల మార్కెట్ వేరే స్థలంలో ఏర్పాటు చేయడం వల్ల చాలా నష్టపోతున్నామని అన్నారు దయచేసి గ్రామ అభివృద్ధిని వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకొని వెంటనే మెయిన్ రోడ్ లో మార్కెట్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ ని సెక్రెటరీ ని వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో. కోరబోయిన నరేష్ యనగండ్ల నరేందర్.మ్యాధరి శంకరయ్య. పల్నాటి బాస్కర్. విష్ణు మూర్తి. తోట సంజీవ. వడ్లనరేష్.కృష్ణ బాల్ రెడ్డి. ప్రశాంత్. నర్సింలు. వినోద్. సాయిలు. పాల్గొన్నారు