గ్యార్వి షరీఫ్ ముబారక్ ఉత్సవాల్లో రాగం నాగేందర్ యాదవ్

Spread the love

Ragam Nagender Yadav in Garvi Sharif Mubarak Utsavam

గ్యార్వి షరీఫ్ ముబారక్ ఉత్సవాల్లో .. రాగం నాగేందర్ యాదవ్


సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ పరిధి నెహ్రు నగర్ కాలనీలో నిర్వహించిన గ్యార్వి షరీఫ్ ముబారక్ వేడుకల్లో ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికపూడి గాంధీ , ముఖ్య అతిథులుగా పాల్గొనిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్యార్వి షరీఫ్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలాని స్మారకార్థం ఇస్లామిక్ సూఫీ పండుగ

ప్రతి సంవత్సరం 11వ రబీ-అల్-అఖిర్ లేదా ఇస్లామిక్ చంద్ర నెల 11వ రోజున ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సిఐ క్యాస్ట్రో, మరిజా మహ్మోద్, ఫాక్రుద్దీన్,

మహమ్మద్ అర్షద్, షైక్ తాహేర్, షైక్ గఫ్ఫార్, అబ్దుల్ అజిజ్, షైక్ హాజీ, సల్మాన్ అజిజ్, షైక్ అయాన్, మహమ్మద్ అస్లాం, మహమ్మద్ మతీన్, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, రాజు యాదవ్, పద్మ రావు, సత్యనారాయణ, రవీందర్ గౌడ్, సాయి తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page