పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోరుతు దరఖాస్తు సమర్పించిన బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అంతిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి

Spread the love

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్టు కోరుతూ దరఖాస్తును గాంధీ భవన్ లో బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అంతిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”పార్టీకి విధేయుడిగా,క్షేత్ర స్థాయిలో పార్టీని బలపరుస్తూ, పార్టీ కార్యక్రమాలను తూచా తప్పకుండా నిర్వహిస్తు పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తనను ఆశీర్వదించి పటాన్ చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని, యువకుడిగా,ఉత్సాహవంతుడిగా,పేదల పక్షపాతిగా ఉన్న తనను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చి ప్రోత్సహించాలని ప్రార్థిస్తున్నాను అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బొల్లారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతిరెడ్డి బాలసుబ్రమణ్య రెడ్డి,ఖాజీపల్లి ఎంపిటిసి ఆకుల భార్గవ్,బొల్లారం కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు కాటారం శ్రీనివాస్,పార్టీ సీనియర్ నాయకులు రాజిరెడ్డి, సత్తిబాబు ,పెద్ద వెంకటయ్య,రాధాకృష్ణ, భాస్కర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు నందు, చంద్రశేఖర్ గౌడ్ మరియు రఫీ తదితరులు పాల్గొనడం జరిగింది

Related Posts

You cannot copy content of this page