నందివాడ మండలంలో నాలుగో విడత ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని

Spread the love

నందివాడ మండలంలో నాలుగో విడత ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని….. ఆత్మీయ స్వాగతం పలికిన మహిలమ్మ తల్లులు

-6కోట్ల78లక్షల,57వేల,968 రూపాయల జంబో చెక్కును ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాని…

-ఆర్థిక ఇబ్బందులు ఉన్న అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న గొప్పవ్యక్తి సీఎంజగన్…

-చేసిన మంచిని చూసి ప్రజలందరూ జగన్ కు అండగా నిలవాలి…

-ప్రజలందరూ అసెంబ్లీ, పార్లమెంట్ కు రెండు బటన్లు ఫ్యాను గుర్తుకు నొక్కితే…. రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం పీడ విరగడవుతుంది

గుడివాడ : నందివాడ మండలంలో నిర్వహించిన నాలుగవ విడత ఆసరా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని సోమవారం ప్రారంభించారు. నందివాడ జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో వేలాదిగా స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. తొలుత కార్యక్రమంలో పాల్గొనందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు , పూల వర్షం కురిపిస్తూ మహిళలు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకాలు నిర్వహిస్తూ, థాంక్యూ జగనన్న అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మండల పరిధిలోని 790 గ్రూపులలోని 7853 అక్క చెల్లెమ్మలకు ఆరు కోట్ల 78 లక్షల,57వేల,968 రూపాయల నాలుగో విడత ఆసరా జంబో చెక్కును, లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఆసరా సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. నేడు నాలుగో విడత ఆసరా పథకంలో భాగంగా 6వేల 5వందల కోట్ల రూపాయలు మహిలమ్మ తల్లుల ఖాతాలో సీఎం జగన్ ట్రాన్స్ ఫర్ చేశారన్నారు.25వేల 570 కోట్ల అప్పు చెల్లిస్తానని అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను, ఆర్థిక ఇబ్బందులు వచ్చిన వెనకడుగు వేయకుండా ఆసరా పథకం ద్వారా సీఎం జగన్ నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే నాని కొనియాడారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క పైసా కూడా మాఫీ చేయకుండా, ఉన్న సున్నా వడ్డీని, రూపాయికి పెంచి 11 వేల కోట్లు దోచుకున్నాడని కొడాలి నాని విమర్శించారు.

ఇచ్చిన హామీ మేరకు 21 వేల కోట్ల అప్పు మాఫీ చేయకుండా, పసుపు కుంకుమ అంటూ 9వేల 300 కోట్లు విడుదల చేసి చంద్రబాబు చేసిన మోసానికి అక్క చెల్లెమ్మలు గట్టి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చో పెట్టారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పాలనను ప్రజల ఇళ్ల వద్దకు చేరువ చేయడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయి విద్యా ,వైద్యాన్ని పేద కుటుంబాలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్ దే నన్నారు. పైసా ఖర్చు లేకుండా అర్హులందరి సంక్షేమ పథకాలు అందేలా సీఎం జగన్ సంక్షేమ పాలన చేస్తున్నారన్నారు. పేద ప్రజలకు మరింత మేలు చేసేలా మంచి మేనిఫెస్టో తో cm జగన్ ప్రజల ముందుకు వస్తారని, చేసిన మంచిని చూసి ప్రజలందరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సిపి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపునిచ్చారు. నాలుగో విడత ఆసరా కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశి భూషణ్, ఎంపీపీ పేయ్యల ఆదాం, జడ్పిటిసి కందుల దుర్గా కుమారి, సర్పంచ్ రత్నకుమారి, వైస్ ఎంపీపీ పూడి సుధాకర్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ కొండపల్లి కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు కొండపల్లి చంద్రశేఖర్ రెడ్డి, కందుల నాగరాజు, తోట నాగరాజు, కృష్ణారెడ్డి, నాగేశ్వరరావు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, వేలాదిగా స్వయం సహాయక సంఘాల మహిళలు, మండలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page