నగరం లో అగ్ని ప్రమాదాల పై మంత్రి కె. టి. రామారావు నేతృత్వం

Spread the love

Minister K. T. on fire accidents in the city. Rama Rao’s leadership

సాక్షిత : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ బీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయం
…నగరం లో అగ్ని ప్రమాదాల పై మంత్రి కె. టి. రామారావు నేతృత్వం లో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది


..అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశం లో చర్చించాం
…ఈ మధ్య జరిగిన అగ్ని ప్రమాదాల పై లోతుగా చర్చించాం
..అక్రమ కట్టడాలు ,ఫైర్ సేఫ్టీ పాటించని భవనాలను గుర్తించేందుకు ఓ ప్రత్యేక కమిటీ ని నియమించాం
…ఈ కమిటీ ప్రభుత్వ భవనాలను కూడా పరీశీలిస్తుంది.
..త్వరలోనే స్పెషల్ డ్రైవ్ ప్రారంభిస్తాం


..అగ్ని మాపక యంత్రాలు వెళ్లలేని స్థితిలో ఉన్నపుడు వాడుకోవాల్సిన సాంకేతికత పై కూడా చర్చించాం
..అగ్ని ప్రమాదం జరిగిన నల్ల గుట్ట భవనాన్ని కూల్చేందుకు టెండర్ పిలిచాం.41 లక్షల రూపాయలకు టెండర్ ఖరారైంది
..రేపటి నుంచి కూల్చి వేత ప్రారంభిస్తాం


..చిన్న పరిణామం లో ఉండే అగ్ని మాపక యంత్రాలను భవిష్యత్ లో వినియోగించేందుకు ఆలోచిస్తున్నాం
..భవనాల్లో సామర్ధ్యానికి మించి వస్తువుల నిల్వ వల్ల అగ్ని ప్రమాదాల ఉధృతి పెరుగుతోంది
…భవిష్యత్ లో అగ్ని ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం
..ఉన్న ఫళంగా అక్రమ కట్టడాలను తొలగించలేం.. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం
..నల్ల గుట్ట అగ్ని ప్రమాదం లో మృతులకు ఐదు లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నాం
..రిపబ్లిక్ వేడుకలు నిబంధనల మేరకు జరుగుతాయి
..ఇందులో రాజకీయం ఏమి లేదు


…కేసీఆర్ పుట్టిన రోజు నాడు సచివాలయం ప్రారంభిస్తే తప్పేమిటీ?
..మోడీ పుట్టిన రోజు నాడు కేంద్ర ప్రభుత్వం ఏదైనా కడితే దాన్ని ప్రారంభించుకోవచ్చు.. బండి సంజయ్ మోడీ కి ఆ సలహా ఇచ్చుకోవచ్చు
..ప్రతి దాన్ని వివాదం చేయడం బీజేపీ కి అలవాటు గా మారింది

Related Posts

You cannot copy content of this page