రైల్వే ట్రాక్ లైను పనులు పరిశీలించిన మంత్రి హరీష్ రావు

Spread the love


Minister Harish Rao inspected the railway track line works

రైల్వే ట్రాక్ లైను పనులు పరిశీలించిన మంత్రి హరీష్ రావు


సాక్షిత : సిద్ధిపేట రంగదాంపల్లి రైల్వే స్టేషన్, దుద్దెడ-సిద్ధిపేట రైల్వే స్టేషన్ వరకూ దాదాపు 10కిలో మీటర్ల మేర జరుగుతున్న రైల్వే ట్రాక్ లైను పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న మంత్రి హరీశ్ రావు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సంతోష్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమరాజు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జనార్ధన్ బాబు, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికార యంత్రాంగంతో కలిసి పరిశీలన.

మార్చిలోపు సిద్ధిపేటలో రైలు కూత వచ్చేలా యుద్ధప్రాతిపదికన రైల్వే ట్రాక్ పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులకు మంత్రి ఆదేశం.

దుద్దెడ-సిద్ధిపేట వరకూ రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో జాప్యం జరగొద్దని, పనుల వేగం పెంచాలని రైల్వే శాఖ అధికార యంత్రాంగం, కాంట్రాక్టర్ కు మంత్రి ఆదేశం.

దుద్దెడ-సిద్ధిపేట వరకూ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులలో భాగంగా కేవలం 5కిలోమీటర్ల మేర ట్రాక్ చేపట్టాల్సి ఉన్నదని మంత్రికి వివరించిన రైల్వే శాఖ అధికారులు.

సిద్ధిపేట-రంగదాంపల్లి రైల్వే స్టేషన్ పనులు మందకొడిగా సాగుతున్న దరిమిలా రైల్వే శాఖపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు.

దుద్దెడ-సిద్ధిపేట రైల్వే ట్రాక్ పనులలో మందపల్లి వద్ద అండర్ పాస్, కుకునూరుపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణ జాప్యం పై ఆరా తీసి, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులకు మంత్రి ఆదేశం.

శ్రీ కొమురవెళ్లి మల్లన్న ఆలయానికి వచ్చే భక్తుల రాక స్టేషన్ నిర్మాణం పై రైల్వే శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ తో మంత్రి సమాలోచనలు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page