మధిర నియోజకవర్గంలో అన్ని రంగాలలో అభివృద్ధి పర్చడం జరుగుతుంది

Spread the love

మధిర నియోజకవర్గంలో అన్ని రంగాలలో అభివృద్ధి పర్చడం జరుగుతుంది

-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖా మాత్యులు మల్లు భట్టి విక్రమార్క

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

మధిర నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రహదారుల నిర్మాణం పూర్తి చేసి, అన్ని రంగాలలో అభివృద్ధి పర్చడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖా మాత్యులు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం ఉప ముఖ్యమంత్రి చింతకాని, బోనకల్‌, ముదిగొండ మండలాల్లో పర్యటించి, రూ.4318.70 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌తో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. చింతకాని మండలం ప్రొద్దుటూరు నుండి పాతర్లపాడు వరకు రూ. 700.00 లక్షలతో 5.30 కి.మీ మేర నిర్మించనున్న బిటి రోడ్డు పనులకు, రాఘవాపురం నుండి అల్లీపురం వరకు రూ. 200 లక్షలతో 1.70 కి.మీ. రోడ్డు విస్తరణ పనులకు, రాఘవాపురం నుండి లచ్చగూడెం వరకు రూ. 280.00 లక్షలతో 3.00 కి.మీ. మేర నిర్మించనున్న బి.టి. రోడ్డుకు, రాఘవాపురం నుండి లచ్చగూడెం వరకు రూ. 320.00 లక్షలతో 2.50 కి.మీ. మేర నిర్మించనున్న బి.టి. రోడ్డు పనులకు శంకుస్థాపన, బోనకల్‌ మండలం లక్ష్మిపురం గ్రామంలో రూ. 20.00 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయితీ భవనమును ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ఆళ్లపాడు నుండి గోవిందాపురం వరకు రూ. 289.80 లక్షలతో 3.20 కి.మీ. మేర నిర్మించనున్న నూతన బి.టి. రోడ్డుకు, లక్ష్మిపురం నుండి పాతర్లపాడు వరకు రూ. 277.25 లక్షలతో 3.00 కి.మి. మేర నిర్మించనున్న బి.టి రోడ్డుకు, కలకోట నుండి నారాయణపురం వరకు రూ. 85.00 లక్షలతో 5.00 కి.మి. మేర నిర్మించనున్న బి.టి. రోడ్డు పనులకు ఉప ముఖ్యమంత్రి శంఖుస్థాపనల చేశారు. రూ. 422.15 లక్షలతో గోవిందాపురం నుండి మోటమర్రి వరకు 4.60 కి.మి. మేర నిర్మించనున్న బి.టి. రోడ్డు పనులకు, రూ. 539.50 లక్షలతో ఆళ్లపాడు నుండి నారాయణపురం 5.00 కి.మి. మేర నిర్మించనున్న బి.టి. రోడ్డు పనులకు, అనంతరం ముదిగొండ మండలం వనంవారి క్రిష్ణాపురం గ్రామంకు చేరుకొని గోకెనపల్లి వెంకటాపురం చిరుమర్రి వనంవారి క్రిష్ణాపురం జగన్నాదపురం ఆర్‌.అండ్‌.బి. రోడ్డు విస్తరణ పనులకు ఆయన శంఖుస్థాపనలు చేశారు. రూ. 4318.70 లక్షల వ్యయంతో 44.10 కి.మీ. మేర నిర్మించనున్న బి.టి. రోడ్‌ నిర్మాణ పనులకు శంఖుస్థాపనలు చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మధిర నియోజకవర్గం అన్ని మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసి రవాణా వ్యవస్థను మెరుగుపర్చడం జరగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లడం జరుగుతుందని, అర్హులైన పేద వారందరికి అభయహస్తం సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు. అనంతరం చింతకాని మండలంలో పాత్రికేయుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఏ. రేవంత్‌రెడ్డి భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని సహాచర మంత్రివర్యులతో కలిసి లాంఛనంగా ప్రారంభోత్సవం చేయనున్నారని తెలిపారు. నియోజవర్గానికి 3500 ఇండ్ల చొప్పున ప్రతి నియోజకవర్గానికి ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మార్చి 12వ తేదీన మరో బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభయహస్తం, సంక్షేమ పథకాలపై పాత్రికేయుల సమావేశంలో వివరించారు.
ఈ కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు మాలోతు రాందాస్‌ నాయక్‌, అదనపు కలెక్టర్‌ డి. మధుసూదన్‌ నాయక్‌, ఆర్‌ అండ్‌ బి ఎస్‌ఈ శ్యాంప్రసాద్‌, పంచాయితీరాజ్‌ ఎస్‌.ఈ. చంద్రమౌళీశ్వరరావు, ఖమ్మం ఆర్‌.డి.ఓ. జి.గణేష్‌, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page