హ్యాట్రిక్ కొట్టడానికి వ్యూహాత్మకంగా కేసీఆర్ సీక్రెట్ సర్వే

Spread the love

హైదరాబాద్ :జూన్ 21
అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైపోయింది.. హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్‌ను మూడోసారి అధికారంలోకి రానివ్వకూడదని కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ ప్రతిపక్షాల ఊహకందని రీతిలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రహస్య సర్వేలు నిర్వహించిన బాస్.. అన్నిపార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇంతకీ ఈ ప్రకటన ఎప్పుడు ఉండొచ్చు..? ఎన్ని విడతలుగా అభ్యర్థుల జాబితా ప్రకటించబోతున్నారు..? బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నాయి..? సీక్రెట్ సర్వేలు ఎలా చేశారు..?

తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈసారి ఎలాగైనా సరే 100 స్థానాల్లో గెలిచి.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావలన్నది కేసీఆర్ ఆలోచన. ఇందుకు ఎన్నికలకు ఏడాది ముందు నుంచే అన్నీ వ్యూహాత్మకంగా చేసుకుంటూ వస్తున్నారట. మొదట అన్ని అసెంబ్లీ స్థానాల్లో మూడో కంటికి తెలియకుండా రహస్య సర్వేలు చేయించారట. ఇందులోని డేటా ఆధారంగా కేటాయించాలనుకున్న వారికి కేసీఆర్ పాస్‌మార్క్ స్కేలు పెట్టుకున్నారట. అసెంబ్లీ టికెట్ రావాలంటే 35 శాతంతో పాసైతే సరిపోదు.. కచ్చితంగా 40 నుంచి 45 శాతం వరకు పాజిటివ్ రేటింగ్ ఉంటేనే ఈసారి బీఫారం ఇవ్వాలని గులాబీ బాస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలా ఎవరికైతే పాస్ పర్సెంటేజ్ ఉంటుందో వారందరి పేర్లతో తొలి జాబితాను రిలీజ్ చేయడానికి సీఎం సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ 35 శాతం కూడా లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వకూడదని సార్ ఫిక్సయ్యారట. ఎందుకంటే ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా బాస్ భావిస్తున్నారు.. ఏ ఒక్క స్థానాన్ని చేజేతులారా పోగొట్టుకోకూడదన్నదే టార్గెట్!. ఎలాంటి పైరవీలకు చోటు లేకుండా బంధుత్వం, సన్నిహిత సంబంధాలు ఇలాంటివి అస్సలే చూడకుండా కేసీఆర్ సీక్రెట్ సర్వేలు చేయించారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అన్నీ అనుకున్నట్లు జరిగితే జులై 15 తర్వాత ఏ క్షణంలో అయినా బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను స్వయంగా కేసీఆర్ ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తొలిజాబితాలో మొత్తం 80 మంది అభ్యర్థులను ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. తొలి జాబితాలో ఉండే ఆ 80 మంది ఎవరన్న దానిపై ఇప్పుడు బీఆర్ఎస్‌ వర్గాల్లో, ఆశావహుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈసారి అయినా కేసీఆర్ కరుణించి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనుకున్న వారికి సీక్రెట్ సర్వేతో టెన్షన్ మొదలైందట. అయితే.. సరిగ్గా జులై రెండోవారంపైనే ఎందుకు ప్రకటన అంటే దీనికి పెద్ద ప్లానే ఉందట. ముందుగా ప్రకటన చేస్తే ఎక్కడైతే నెగిటివ్ ఉందో దాన్ని సరిచేసుకునేందుకు ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇచ్చినట్లు అని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పట్నుంచి మరింత గ్రాఫ్ పెంచుకుని ఎక్కడ తేడాలున్నాయనేది నెగిటివ్‌ను పాజిటివ్ చేసుకునేందుకు ఈ వ్యవధిని బాస్ ఇస్తున్నారట. అంతేకాదు.. ప్రకటన తర్వాత ఇక ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాలకే పూర్తిగా పరిమితం కావాలని కీలక ఆదేశాలు కేసీఆర్ ఇవ్వబోతున్నారట. అంటే మొదటి జాబితాలో పేర్లు వచ్చిన వారికి కనీసం నాలుగు నెలలు సమయం దొరుకుతుందన్న మాట. దీంతో గ్రాఫ్ పెంచుకోవచ్చు.. అదే విధంగా కొద్దో గొప్పో ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి వెళ్లి తగ్గించుకొని ఎన్నికల నాటికి నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించుకోవచ్చన్నది కేసీఆర్ ప్లానట.

Related Posts

You cannot copy content of this page