పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన.

Spread the love

Jagananna is a foreign education blessing for poor students.

పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన.. తొలివిడతగా రూ.19.95కోట్లు విడుదల

200ల వర్సిటీల్లో ఆడ్మిషన్లు పొందిన 213మంది విద్యార్థులకు ఆర్థికసాయం

ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ జెండా ఎగరేయాలి: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా టాప్‌ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య నభ్యసించేలా ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో టాప్‌-200 వర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులకు మొదటి విడతలో సాయంగా రూ. 19.95 కోట్లను బటన్‌ నొక్కి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జమ చేశారు.

జగనన్న విదేశీ విద్యా దీవెన రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని సీఎం జగన్ మోహర్ రెడ్డి అన్నారు. ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల పేద విద్యార్థులకు ప్రపంచంలోనే టాప్‌ వర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించామని తెలిపారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఒక్క చదువేనని, పేదల చదువుకు పేదరికం అడ్డుకాకూడదన్నారు.

విదేశీ వర్సిటీల్లో 213 మంది విద్యార్థులు అ‍డ్మిషన్లు పొందారని వీరందరికి తొలివిడతగా రూ.19.95 కోట్ల సాయం అందిస్తున్నామన్నారు. ప్రపంచ వేదికపై దేశం, ఆంధ్రప్రదేశ్ జెండా ఎగురవేయాలని..మన పిల్లలు ప్రపంచ స్థాయిలో రాణించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆకాక్షించారు.

పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని..విద్య మీద పెట్టే ప్రతి పెట్టుబడి కూడా మానవ వనరుల మీద పెట్టినట్టేనని సీఎం తెలిపారు. కుటుంబాల తలరాతలే కాదు.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి తలరాతలు కూడా మారుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహాత్మ గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, అంబేద్కర్‌ వంటి వాళ్లు పెద్ద యూనివర్శిటీల నుంచి వచ్చినవారేనని గుర్తు చేశారు. అందుకే పేద పిల్లలు చదువుకునేలా అడుగులు వేయిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు.

గతంలో కేవలం రూ. 10లక్షలు మాత్రమే ఇచ్చేవారని.. 2016-17లో రూ.300 కోట్లు బకాయిలు పెట్టారని సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు, మిగిలిన విద్యార్థులకు గరిష్టంగా రూ.కోటి వరకు సాయం అందిస్తున్నామని తెలిపారు.

ట్యూషన్‌ ఫీజు వందశాతం రీయింబర్స్‌మెంట్స్‌ ఇస్తున్నామన్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే సీఎంఓలో అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రతీ విషయంలో మీకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page