కుషాయిగూడ డిపో ఆధ్వర్యంలో ఐటి కారిడారు ప్రత్యేక బస్సు

Spread the love

IT Corridor Special Bus under Kushaiguda Depot

కుషాయిగూడ డిపో ఆధ్వర్యంలో ఐటి కారిడారు ప్రత్యేక బస్సు

కుషాయిగూడ సాక్షిత ప్రతినిధి;-
కుషాయిగూడ డిపో నుండి గచ్చిబౌలి ఐటి కడియారకు ప్రత్యేక బస్సును సోమవారం నుంచి ప్రారంభిస్తున్నామని సికింద్రాబాద్ డివిఎం అపర్ణ కళ్యాణి బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఈ ప్రత్యేక బస్సు ఐటి ఉద్యోగుల కొరకై తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ బస్సును సోమవారం నుండి కుషాయిగూడ డిపో నుండి ఉదయం 8:00గంటలకు మౌలాలి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి బస్సు బయలుదేరి ఈసీఐఎల్, నేరేడ్మెట్, తిరుమలగిరి, బోవిన్ పల్లి మీదుగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఫేస్ ఫోర్ నుండి, హైటెక్ సిటీ శిల్పారామం గుండా గచ్చిబౌలి జి ఏ ఆర్ వెళ్తుంది. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్క ప్రయాణికుడు సద్వినియోగం చేసుకోగలరని, మళ్లీ తిరుగు ప్రయాణం సాయంత్రం 6:30 నుండి జి ఏ ఆర్ గచ్చిబౌలి నుండి బయలుదేరి మౌలాలి హౌసింగ్ బోర్డ్ చేరుకుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క స్పెషల్ బస్సులో ఎలాంటి బస్సు పాసులు చెల్లుబాటు కావున ప్రయాణికులు గమనించి మాకు సహకరించగలరని, మరిన్ని వివరాల కొరకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరని కోరారు. 9959226145, 7382924742, 7382819362, 8121401578

ఈ కార్యక్రమంలో కుషాయిగూడ డిపో మేనేజర్ పి చంద్రకాంత్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీపతి కృష్ణ పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page