10వ బెటాలియన్ లో జాతీయ పతాక ఆవిష్కరణ

Spread the love

Inauguration of National Flag in 10th Battalion

10వ బెటాలియన్ లో జాతీయ పతాక ఆవిష్కరణ.!

బీచుపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా పదవ బెటాలియన్ బీచ్పల్లిలో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలను కమాండెంట్ బి. రాంప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కమాండెంట్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం కమాండెంట్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు స్వాతంత్రంకు ముందు బ్రిటిష్ వారి పాలనలోను, తరువాత నిజాం నిరంకుశ పాలనలో ఎన్నో సంవత్సరాలు మగ్గిపోయారు.

1947లో భారతదేశం మొత్తం స్వాతంత్రాన్ని పొందిన తెలంగాణ ప్రజలకు మాత్రం ఆ అదృష్టం దక్కలేదు అన్నారు. నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో కలవనీయకుండా స్వతంత్రంగా ఉండాలని ప్రయత్నించారు, కానీ అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాకచక్యంగా పోలీస్ చర్య ద్వారా నిజాం నవాబును ఒప్పించి హైదరాబాద్ ను భారత యూనియన్ లో కలిపారు అన్నారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నాగభూషణం RI లు రాజేష్, రమేష్ బాబు.. ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page