ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

Spread the love

150 మంది టిడిపి బీసీ సెల్ నాయకులకు….. పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నాని

-సీఎం జగన్ ప్రభుత్వంపై బీసీ సోదరులు పూర్తి విశ్వాసంతో ఉన్నారు….

-టీడీపీకు బీసీలు ఎప్పుడో దూరమైపోయారు….

-కుక్క కాటుకు చెప్పు దెబ్బలా ఎన్నారై అభ్యర్థికి…. గుడివాడ ప్రజలు బుద్ధి చెబుతారు

గుడివాడ టిడిపి బీసీ సెల్ నాయకులు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీసీ సెల్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి దేవరపల్లి కోటి, మరో 150 మంది టిడిపి బీసీ సెల్ నాయకులకు ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీ కండువాలు కప్పి, వైఎస్ఆర్సిపిలోకి ఆహ్వానించారు. తొలుత 17వ వార్డులోని సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కొడాలి నాని, సమీపంలో వైసిపి జెండా దిమ్మను ప్రారంభించి పార్టీ జెండాను ఎగరవేశారు. టిడిపిలో బీసీలకు విలువ లేదని, ప్రభుత్వంలో బీసీ సంఘీయులకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యత, గుడివాడలో బీసీల సంక్షేమానికి ఎమ్మెల్యే కొడాలి నాని చేస్తున్న సేవలను చూసి వైఎస్ఆర్సిపిలో చేరుతున్నట్లు బీసీ సంఘ నాయకుడు దేవరపల్లి కోటి తెలియచేశారు. అనంతరం ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ. టిడిపికి బీసీలు ఎప్పుడో దూరమైపోయారని, చంద్రబాబు సామాజిక వర్గం,ఆయన కోటరితో టిడిపి నిండిపోయిందన్నారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ, స్థానిక పదవులు, ఇలా ప్రతి విభాగంలో బీసీలకు 50 శాతం పదవులు ఇస్తున్న ఘనత సీఎం జగన్ ప్రభుత్వాననిదేనని ఎమ్మెల్యే కొడాలి నాని కొనియాడారు. పేద వర్గాల ఆర్థిక ఉన్నతి కోసం అహర్నిశలు కష్టపడుతున్న సీఎం జగన్ కు, రాష్ట్రంలోని బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలు, అగ్రకుల పేదలు మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపునిచ్చారు. అతి సామాన్య బీసీ సోదరులను, ఎమ్మెల్యేలుగా నిలబెడుతూ, జనరల్ స్థానాల్లో ఉన్నత పదవులు కట్టబెడుతూ సీఎం జగన్ తనలోని నిబద్ధత చాటుకున్నారని ఎమ్మెల్యే నాని అన్నారు.


అదే చంద్రబాబు గుడివాడలో పార్టీ కోసం పనిచేసిన వారిని కాకుండా, 150 కోట్లు ఖర్చు చేస్తాడన్న అర్హతతో బయట వ్యక్తులకు టికెట్ ఇచ్చాడని ఎమ్మెల్యే నాని ఆరోపించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఒక్క గుడివాడలోని సీఎం జగన్ ప్రభుత్వం ఐదు వేల కోట్లు ఖర్చు చేసిందని, కుక్క కాటుకు చెప్పు దెబ్బలా ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో, ఎన్నారై తిరిగి అమెరికా వెళ్లడం ఖాయమని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే నానిను గజమాలలతో అభిమానులు ఘనంగా సత్కరించారు. పార్టీ చేరికల కార్యక్రమంలో వైసీపీ నాయకులు దారం ఏడుకొండలు, 17వ వార్డు వైసిపి ఇంచార్జ్ దారం కాంచన కుమారి,వైసిపి జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, పార్టీ నాయకులు పాలేటి చంటి,జోగా సూర్యప్రకాశరావు, సర్దార్ బేగ్,అలీ బేగ్, చింతల భాస్కరరావు, డాక్టర్ ఆర్కే, దారం నరసింహారావు, మైనార్టీ సెల్ అధ్యక్షుగా షేక్ బాజీ,అలిబెగ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు రిమల్లి నిలాకాంత్, సంచార జాతుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ సయ్యద్, రావులకొల్లు సుబ్రహ్మణ్యం, గంటా శ్రీనివాస్, యార్లగడ్డ రవి, రజాక్ భాష, వెంపటి సైమన్, దూడల వెంకటేశ్వరరావు, చుండూరి శేఖర్, మూడేడ్ల ఉమా, డాక్టర్ ఆర్కే, సింగిరెడ్డి గగారిన్, మురళి, పెద్దారెడ్డి, అల్లం సూర్యప్రభ,జ్యోతుల సత్యవెణి,బొర్రా రవి, గానుగుల ఆనంద మురళి, వంగలపూడి కనక బాబు, అసిలేటి అర్జున రావు,దుడ్డు చిన్నా, మామిల్ల ఎలీషా,గిరి బాబాయ్, యార్లగడ్డ గోవర్దనరావు, అల్లం రామ్మోహన్రావు, కొంకితల ఆంజనేయ ప్రసాద్,మీగడ రామరాజు,మండలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు అభిమానులు , సచివాలయ కన్వీనర్ లు , గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page