ఆంబీర్ చెరువు వద్ద ఉన్న కొలనులో వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పట్లను

Spread the love

Immersion of Ganesha idols is arranged in the pool at Ambir pond

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ రోడ్, ఆంబీర్ చెరువు వద్ద ఉన్న కొలనులో వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పట్లను పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ మరియు ఇరిగేషన్ అధికారులతో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .

ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లడుతూ, నిమజ్జనం ఏర్పాట్లు బాగా చేస్తున్నారని, ఎప్పటికప్పుడు పరిసరాలు, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఏ ఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, ఎస్ ఎస్ లింగారెడ్డి, ఎస్ ఆర్ పి సత్యనారాయణ, ఎస్ ఎఫ్ ఐ లు సంజీవ రావు, వెంకట్రావు వారి సిబ్బంది మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page