రేజోనన్స్ శ్రీనివాస్ నగర్ లో హోలీ సంబరాలు

Spread the love

రేజోనన్స్ శ్రీనివాస్ నగర్ లో హోలీ సంబరాలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో గల రేజోనన్స్ పాఠశాలలో చాలా వైభవంగా హోలీ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణమంతా రకరకాల రంగులతో రంగుల హరివిల్లును తలిపించేలా ముస్తాబు చేశారు. విద్యార్థిని విద్యార్థులంతా రంగురంగుల సీతాకోకచిలుకలని తలపించేలా ముస్తాబయ్యారు. హోలీ సంబరాన్ని ఆనందోత్సాహాలతో చిన్నారులతో సంబురంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల డైరెక్టర్స్ ఆర్ వి నాగేంద్ర కుమార్ నీలిమ ముఖ్య అతిథులై పాఠశాలకు విచ్చేసి చిన్నారులతో ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని జరిపించారు. హోలీ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల డైరెక్టర్ నాగేంద్ర కుమార్ వారి యొక్క విలువైన సందేశాన్ని విద్యార్థులకు హోలీ యొక్క ప్రాముఖ్యతను వివరించారు హోలీని రంగుల పండగ అంటారు ఇది భారతదేశంలో ముఖ్యమైన పండుగలలో ఒకటి ప్రతి సంవత్సరం హోలీని హిందూమతం అనుచారులు మార్చి నెలలో ఉత్సాహంతో జరుపుకుంటారు రంగులతో ఆడుకోవటానికి ఆసక్తిగా ఎదురు చూస్తారు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం పాల్గొనమాసంలో పౌర్ణమి రోజున వస్తుంది ఈ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు కుల, మత, జాతి మరియు వర్ణభేదం లేకుండా భారతదేశంలో ప్రజలు ఘనంగా హోలీ పండుగను జరుపుకుంటారు. హోలీకా పూర్ణిమ, కామ దహనం అనే పేరు ఉన్నాయి . హోళికా అనే రాక్షసి మంటల్లో దహనమైన రోజు కాబట్టి ఈ పండుగను జరుపుకుంారు. మన్మధుడిని మహాశివుడు దహనం చేస్తాడు ఆ పర్వదినం కామ దహనంగా పిలుస్తారు హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్ధం.
హోలీ చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది.
ఈ విధంగా గా ఆర్ వి నాగేంద్ర కుమార్ మరియు నీలిమ వారి విలువైన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాటశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయిని మరియు ఉపాధ్యాయూలు విద్యార్థుల తల్లదండ్రులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page