బాచుపల్లిలో అంగరంగ వైభవంగా హరిహర సుతుడు అయ్యప్ప మహా పడిపూజ…

Spread the love

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ కార్పొరేటర్ ఆగం పాండు ఆధ్వర్యంలో నిర్వహించిన మహా పడిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ..

బాచుపల్లి లోని బైరాన్ చెరువు వద్ద 17వ డివిజన్ కార్పొరేటర్ ఆగం పాండు ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత చేకూరడమే కాకుండా విఘ్నాలు లేకుండా చేపట్టిన ప్రతి కార్యం ఫలవంతమవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు కొలన్ గోపాల్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page