టిడిపి నేత కాగిత కృష్ణ ప్రసాద్ అరెస్టును ఖండించిన గుడివాడ టిడిపి నాయకుడు వెనిగండ్ల రాము

Spread the love

పోలీస్ స్టేషన్లో ఉన్న కృష్ణ ప్రసాద్ ను పార్టీ నేతలతో కలిసి సంఘీభావం తెలిపిన రాము…

-టిడిపి బీసీ నేతలను వేధిస్తున్న జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి…

-సార్వత్రిక ఎన్నికల్లో బీసీ సోదరుల చేతుల్లో వైసీపీ ప్రభుత్వానికి చావు దెబ్బ తప్పదు….

-ప్రజల సమస్యలను ప్రశ్నించడమే కృష్ణ ప్రసాద్ చేసిన నేరమా….

ప్రజల పక్షాన ప్రశ్నించిన టిడిపి నాయకుడు కాగిత కృష్ణ ప్రసాద్ ను పోలీసులు అరెస్టు చేయడం దారుణమని కృష్ణ జిల్లా గుడివాడ టిడిపి సీనియర్ నాయకుడు వెనిగండ్ల రాము మండిపడ్డారు. ప్రజల పోలీస్ స్టేషన్లో కాగిత కృష్ణ ప్రసాద్ కు మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావు మరియు టిడిపి నేతలతో కలిసి వెనిగండ్ల రాము సంఘీభావం తెలిపారు.మంత్రి జోగి రమేష్ సభ్యసమాజం తలదించుకునేలా దుర్భాషలు అడిన జగన్ రెడ్డికి వినసొంపుగా ఉన్నాయని, ప్రజల కోసం ప్రతిపక్షాలు మాట్లాడితే జగన్ కు కోపం వస్తుందని రాము అన్నారు. చిన్నపాటి కారణాలతో టిడిపి బీసీ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని ఆయన ఖండించారు.రాజ్యాంగ పదవిలో మంత్రి జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలిపిన టిడిపి బీసీ నేత కాగిత కృష్ణ ప్రసాద్ ను అదుపులోకి తీసుకోవడం అత్యంత హేయమైన చర్యని వెనిగండ్ల రాము ఖండించారు. ప్రజల పక్షాన మాట్లాడుతున్న టీడీపీ బీసీ నేతలను అణిచివేసేందుకే అధికార పార్టీ కుట్రలు చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయం గా అరెస్టు చేసిన కృష్ణ ప్రసాద్ ను విడుదల చేయాలని లేనిపక్షంలో ఉద్యమం తప్పదని వెనిగండ్ల రాము హెచ్చరించారు. శిశుపాలుడు మాదిరి తప్పులు చేసుకుంటూ పోతున్న జగన్ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు అతి దగ్గరలో ఉన్నాయని రాము స్పష్టం చేశారు.

Related Posts

You cannot copy content of this page