కౌలు రైతుల పొలాల్లో ఎండిన వరి పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

Spread the love

మదనాపురం మండలం లోని దంతనూర్ గ్రామంలో రైతులు గట్టన్న,చెన్నయ్య ఎండిన వరి పంటలను స్థానిక నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వరి పంటను పరిశీలించారు

మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..

2014 కంటే ముందున్న పరిస్థితులు పాలమూరు జిల్లాలో కనిపిస్తున్నాయి

కాంగ్రెసోళ్ల చెప్పిన మార్పు ఇదేనేమో
రైతులను ముంచడానికే ఈ ప్రభుత్వం వచ్చింది

ఈ సందర్భంగా మేము రైతుల పక్షాన కరెంటు లేక, సాగునీరు లేక పెట్టుబడి పెట్టి వెయిల రూపాయలు నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం

అసమర్థ పాలన వల్ల ఈ రోజు గ్రామాలలో త్రాగునీటి ఎద్దడి ఏర్పడుతుంది
ఎంతసేపు గత ప్రభుత్వం కేసీఆర్ చేసిన అభివృద్ధి ని విమర్శించడం తప్ప.. అవకాశం వచ్చింది కేసీఆర్ కంటే గొప్పగా పాలన అందించాలనే సోయి కూడా ఈ ప్రభుత్వనికి లేదని అర్థమైతుంది

అమలుగాని హామీ లు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు రైతు భరోసా 15 వేలు ఇస్తామన్నారు ఇప్పటివరకు రైతు బంధు 10 వేలు కూడా జమ చెయ్యలేదు,పింఛన్లు 4000 ఇస్తామన్నారు ఇవ్వడం లేదు

2 లక్షల రుణ మాఫీ ఇప్పటివరకు లేదు
కాంగ్రెస్ పార్టీ 420 హామీలను వెంటనే అమలు చేయాలి…

ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతులు సాగు చేస్తే పంటలు కరెంటు,నీళ్లు, లేక ఎండిపోయాయని, ఇప్పటి వరకు రైతులకు రైతుబందు డబ్బులు రాలేదని,
దంతనూర్ లో కౌలు రైతు చెన్నయ్య ,గట్టాన్న సాగుచేసిన వరి పంట ఎండిపోయి మేకల ను మేపుతున్నాడని ప్రభుత్వం తగు నష్టపరిహారం ఇచ్చి రైతును ఆదుకొలన్నారు.
రైతు గట్టన్న మాట్లాడుతూ.. కరెంటు, నీళ్లు లేక సాగుచేసిన 2 ఎకరాల లో ఎకరన్నర పంట పూర్తిగా ఎండిపోయినందున పంటను మేకలకు వదిలేశానని, కౌలు డబ్బులు మరియు పెట్టుబడి దాదాపుగా 50000 రూపాయలు నష్టపోయానని అన్నారు

ఇప్పటికైనా పరిపాలన పై దృష్టి సారించాలని అన్నారు
రైతులకు కేసీఆర్ గారు చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటున్నారు

బిఆర్ ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉండి ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు కొట్లాడుతుందని అన్నారు

రానున్న ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఎన్నికల్లో కారుగుర్తు కు ఓటు వేయాలని కోరారు

Related Posts

You cannot copy content of this page