మూడు గంటల కరెంటు ఇచ్చే వారి వైపు కాదు మూడు పంటలు పండే సదుపాయం కల్పించే కెసిఆర్ సార్ వైపు రైతులుంటారు

Spread the love

సాక్షిత : చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి , వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మరియు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి చేవెళ్ల లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఏర్పాటుచేసిన కమిటీ పర్యావరణ అనుపతుల కోసం పంపిన రిపోర్ట్ ను ఎలాంటి వివరణ ఇవ్వకుండా రిజెక్ట్ చేయడం సరికాదన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీరు అమ్మ పెట్టదు… అడుక్కొని తిననివ్వదు అన్నట్టు ఉందని, కాళేశ్వరం కు జాతీయ హోదాలో మరియు ప్రత్యేక నిధులు, ప్రాజెక్టులకు సహకరించడంలో వివక్షతను చూపుతూ… అభివృద్ధి చేయడం ఎలాగో చేతకాక, పైగా మనను అభివృద్ధి చేసుకోనివ్వనటువంటి పరిస్థితులు కేంద్రం కల్పిస్తుందని, కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోవాలన్నారు.
దశాబ్దాలుగా పరిపాలన చేసి, రైతులు మరియు ప్రజల గోడు పట్టని కాంగ్రెస్ పార్టీ.. ప్రాజెక్టులను కట్టనివ్వకుండా కేసులు వేసి అడ్డుకోవడం సరికాదన్నారు.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మన ప్రాంతం సాగునీటితో సస్యశ్యామలం కానుంది అన్నారు.
అభివృద్ధిని అడ్డుకుంటూ… రైతులకు మూడు గంటల కరెంటు చాలనే కాంగ్రెస్ వంకర బుద్ధిని, బిజెపి వివక్ష ధోరణిని ప్రజలు పూర్తిస్థాయిలో మట్టు పెడతారన్నారు.

Related Posts

You cannot copy content of this page