గిఫ్ట్ ఎ స్మైల్ లో భాగంగా పారిశుద్ద కార్మికులకు గొడుగులు పంపిణీ…

Spread the love

Distribution of umbrellas to sanitation workers as part of Gift A Smile…

గిఫ్ట్ ఎ స్మైల్ లో భాగంగా పారిశుద్ద కార్మికులకు గొడుగులు పంపిణీ

.
సాక్షిత : * గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా, మేడ్చల్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, MLC శంభిపూర్ రాజు పుట్టినరోజు సందర్భంగా భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి రానున్న వేసవికాలం దృష్టిలో ఉంచుకొని, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పారిశుద్ద కార్మికులకు గొడుగులను (హ్యాట్ అంబ్రీల్లా), మేడ్చల్ జిల్లా గ్రంధాలయం సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్ , BRS పార్టీ సీనియర్ నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి , విష్ణువర్ధన్ రెడ్డి చేతుల మీదుగా పంచిపెట్టడం జరిగింది.

అనంతరం వారు మాట్లాడుతూ ఎండలో పనిచేసే కార్మికులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయని , వడదెబ్బ తగలకుండా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సునీల్, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page