చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల కార్తీకమాస పూజలు

Spread the love
Devotees perform Kartikamasa pujas at Choudammagutta Sri Anjaneyaswamy Temple

 భక్తిశ్రద్ధలతో చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల కార్తీకమాస పూజలు


 మహిళల కోలాటాలు, భక్తుల ఆట పాట భజనలతో వైభవంగా పల్లకి సేవ

ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు

  • అన్నదానం చేసిన పాతపల్లి రామచంద్రారెడ్డి
  • దేవాలయ అభివృద్ధికి శ్రీరామ ఎలక్ట్రికల్ అశోక్ 11,500, చేజేటి జనార్దన్ రెడ్డి 10,516 విరాళం

రంగా రెడ్డి జిల్లా సాక్షిత బ్యూరో ప్రతినిధి

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ పరిధిలో సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో కార్తీక మాసం తొలి శనివారం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం స్వామివారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని పల్లకిలో మోస్తూ శ్రీరామ జయరామ జై జై రామ ఆట పాటలతో భక్తులు పెద్ద ఎత్తున ఆటపాటలతో భజనలతో ఊరేగింపు నిర్వహించడం జరిగింది. మహిళల కోలాటాలు, ఆటపాటలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

దేవాలయ అభివృద్ధికి షాద్ నగర్ పట్టణానికి చెందిన శ్రీరామ ఎలక్ట్రికల్ అశోక్ 11,500, చేజేటి జనార్దన్ రెడ్డి 10,516 విరాళం అందజేశారు. దాత పాతపల్లి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్బంగా శ్రీశైలం గౌడ్ వారికి ధన్యవాదాలు తెలిపి శాలువా పులామాలలతో సన్మానించారు.

దేవాలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీశైలం గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయం చుట్టూ వేస్తున్న సీసీ రోడ్డుకు సహకరిస్తున్న దాతలకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు రఘుపతిరావు, రాఘవేంద్ర చారి, కృష్ణ పంతులు, ప్రమోద్ పంతులు, సునీల్ పంతులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, భక్తులందరికీ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ పల్లకి సేవలో కౌన్సిలర్ ఈశ్వర్ రాజు దంపతులు, కుమార్ గౌడ్, వసంతరావు, పినపాక ప్రభాకర్, గందే సురేష్, నీల రవీందర్, నరేందర్, అన్నారం రఘు గౌడ్, ప్రవీణ్ యాదవ్, నారాయణ, శ్రీనివాస్,
గడ్డమీది రమేష్, కృష్ణయ్య, లక్ష్మికాంత్ రెడ్డి, సతీష్, కృష్ణ చారి, గోరియానాయక్, వీఆర్వో బచ్చన్న, సత్తయ్య, గణేష్, రమేష్ యాదవ్, శ్రీనివాస్, రవీందర్, మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page