అడ్డగుట్ట లో ప్రభుత్వ ఆసుపత్రికి నిధులు మంజూరు, లాలాపేట లో కుడా కొత్త ఆసుపత్రి భవనాలు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వెల్లడి

Spread the love

సాక్షిత సికింద్రాబాద్ : అడ్డగుట్టలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి రూ.13 కోట్ల మేరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ వెల్లడించారు. సితాఫలమండీ లోని తన క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో చిరకాలంగా పరిశీలన దశల్లో ఉన్న వివిధ అంశాల పై దృష్టి సాధించి వాటిని గత 9 సంవత్సరాల్లో పరిష్కరించలిగామని తెలిపారు.

ఈ క్రమంలో అడ్డగుట్టలో ని అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలో ఓ 30 పడకల అధునాతన హంగుల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతిని సాధించామని, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును సంప్రదించగా, జీ ఓ నెంబరు 450 తేది: 10 th ఆగష్టు 2023 ద్వారా రూ.13.05 కోట్ల మేరకు నిధుల మంజురయ్యయని తెలిపారు. అదే విధంగా లాలాపేట లో అర్బన్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ ప్రాంగణంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసి, జీ ఓ నెంబరు 449 తేదీ : 10 ఆగష్టు 2023 ద్వారా రూ.13.05 కోట్ల మేరకు నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఇక మనికేశ్వరి నగర్ లో 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలన్న స్థానికుల అభిమతాన్ని తాము గుర్తుంచి రాష్ట్ర పురపాలక మంత్రి KT రామా రావు సమక్షంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ తో చర్చలు నిర్వహించామని, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈ ఆసుపత్రి ఏర్పాటుకు లాంచనంగా అనుమతిని సాధించామని పద్మారావు గౌడ్ వివరించారు.

ఈ ఆసుపత్రి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులు, సిబ్బంది కి ఉపకరించేలా తీర్చిదిద్దుతమని తెలిపారు. అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు యూనివర్సిటీ అధికారులు వివిధ ప్రతిపాదనలు చేశారని, అడిక్ మెట్ నుంచి విద్యానగర్ వైపు దాదాపు 1.20 కిలోమీటర్ల దూరంలో రూ.16 కోట్ల ఖర్చుతో కొత్త అప్ప్రోచ్ రోడ్డు నిర్మించాలని అందిన విజ్ఞప్త మేరకు మున్సిపల్ మంత్రి KTR ని సంప్రదించి ఈ ప్రాజెక్ట్ కు ఆమోదాన్ని సాధించి, నిధులు మంజూరు చేశామని తెలిపారు.

ఆర్ట్స్ కాలేజి రైల్వే స్టేషన్ నుంచి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వరకు ప్రస్తుతం వివిధ అపాయకర మలుపులతో ఉన్న రహదారి ప్రమాదకరంగా ఉన్నందున నేరుగా ఓ అప్రోచ్ రోడ్డును ఏర్పాటు చేయాలన్న ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల విజ్ఞప్తి మేరకు కొత్త రోడ్డును అభివృద్ధి చేసే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ సదుపాయాలను కల్పిస్తున్నామని, కొన్ని రోజుల క్రితమే సితాఫలమండీ కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణానికి రూ.12 కోట్లు, సితాఫలమండీ ప్రభుత్వ స్కూల్, కాలేజి భవనాల నిర్మాణానికి రూ.30 కోట్ల మేరకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు సామల హేమ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page