చిలకల గండి ముత్యాలమ్మ తల్లిగుడి వెనకాల ఉన్నా పొలాల దగ్గర దారుణంగా హత్య

Spread the love

Chilakala Gandi was brutally murdered near the fields even behind Mutyalamma’s Mother Temple

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (సాక్షిత న్యూస్) అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామం నందు తిరుమల కుంటకి గ్రామానికి చెందిన లింగాల చక్రధర్ ఉన్ అనే వ్యక్తి చిలకల గండి ముత్యాలమ్మ తల్లిగుడి వెనకాల ఉన్నా పొలాల దగ్గర దారుణంగా హత్య చేయబడ్డాడు.

రాత్రి సమయమున ఆరు దాటిన తర్వాత లింగాల చక్రధర్ కనిపించకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి చక్రధర్ కు ఫోన్ చేయడం జరిగింది చక్రధర్ ఫోన్ ఇతరులు ఎత్తడం వలన తన కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది అన్నట్లు తెలియజేశారు. పోలీసులు చనిపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చి పరిశీలించగా తన మెడలో ఉన్న బంగారపు చైను తన బైకు తన ఫోను తీసుకువెళ్లి పోవడం జరిగింది అన్నట్లు తెలియజేశారు.

అంతేకాకుండా డాగ్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయినా ఎవరు అన్నది తెలియకపోవడం కారణంగా పూర్తి వివరాలు తెలియడానికి కొంచెం సమయం పడుతుంది అన్నట్లు పోలీస్ శాఖ అధికారులు తెలియజేశారు.ఈ విషయం తెలిసిన తన భార్య జయలక్ష్మి, వాళ్ల కూతురు ప్రభ, కలసి దుఃఖానికి గురి అయ్యారు ఈ హత్యకు పాల్పడినవారు ఎవరైనా సరే వారిని వదిలిపెట్టకూడదని వారికి శిక్ష పడాలని వాళ్ల కుటుంబ సభ్యులు వారి బాధని వ్యక్తం చేశారు.

Related Posts

You cannot copy content of this page