ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్దవహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..

Spread the love

తిరుపతి ప్రజలకు విద్యుత్ కష్టాలు రానివ్వం…
రూ.18.20 కోట్లతో నాలుగు 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి….


సాక్షిత : తిరుపతి చింతలచేను రవీంద్ర నగర్, ఉపాధ్యాయ నగర్, మున్సిపల్ ప్రకాశం పార్క్ ఎంఆర్ పల్లి మారుతి నగర్ ప్రాంతాల్లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి నాలుగు 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లను ప్రారంభించారు. తిరుపతి నగర మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ తో కలసి ఈ కార్యక్రమాలను చేపట్టారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో భూమన కరుణాకర రెడ్డి మాట్లాడారు.
కరెంట్ కష్టాలు పోవాలనిముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోజన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.‌ ఇందులో భాగంగా తిరుపతిలో నాలుగు 33 కేవీ సబ్ స్టేషన్లను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ నాలుగు సబ్ స్టేషన్ ల నిర్మాణానికి దాదాపు 18 కోట్ల 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని భూమన వెల్లడించారు. నాలుగు సబ్ స్టేషన్లు కూడా విభిన్న విధానాల్లో రూపొందించినట్టు చెప్పారు. తిరుపతిలో ఇక నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేవిధంగా
చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.‌


ఈ నాలుగు సబ్ స్టేషన్ల నిర్మాణం వల్ల విద్యుత్ సరఫరాలో సమస్యలేవీ తలెత్తవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతోందనడానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద వహిస్తోందనడానికి ఇదొక ఉదాహరణగా పేర్కొన్నారు. తిరుపతిలో నాలుగు విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని భూమన కరుణాకర రెడ్డి పునరుద్ఘాటించారు.

Related Posts

You cannot copy content of this page