ఆళ్ల వెంకటేశ్వర్లు మృతి పట్ల బీ ఆర్ ఎస్ లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ

Spread the love


BRS Lok Sabha leader and MP Nama on the death of Alla Venkateshwarlu

ఆళ్ల వెంకటేశ్వర్లు మృతి పట్ల బీ ఆర్ ఎస్ లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ
నాగేశ్వరరావు సంతాపం

స్థానిక పార్టీ నాయకులతో కలసి నివాళులు అర్పించిన ఎంపీ నామ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

చింతకాని మండలం, తిమ్మినేని పాలెం గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆళ్ల వెంకటేశ్వర్లు అకాల మరణం పట్ల బి ఆర్ ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి చింతకాని మండలం తిమ్మినేని పాలెం గ్రామంలో ఉన్న వెంకటేశ్వర్లు నివాసానికి వెళ్లిన ఎంపీ నామ నాగేశ్వరరావు వెంకటేశ్వర్లు భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీపీ పూర్ణయ్య , మండల పార్టీ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, నాయకులు వంకాయలపాటి లచ్చయ్య ,మంకెన రమేష్, గ్రామ సర్పంచ్ దమ్మలపాటి శ్రీదేవి, జగన్మోహన్ రావు, బండి రామారావు, గ్రామశాఖ మాదార్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page