అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గండిమైసమ్మ మండల్ ఆఫీస్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ మల్లారెడ్డి పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ వెంటనే అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని పెన్షన్లు సక్కగా ఇస్తాలేవు రేషన్ కార్డులు లేవు ఒక రోడ్లు సక్కగా లేవు ఏ ఊరు వెళ్ళిన అన్ని చెరువుల ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్న అధికార తెరాస పార్టీ నాయకులు మీ తీరు మార్చుకోకపోతుంటే తగిన రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
బీజేపీ జిల్లా కోశాధికారి పీసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రెండుసార్లు ఎలక్షన్లలో ప్రచారంలో తిరిగినప్పుడు దుండిగల్ మున్సిపాలిటీ పరిధి ప్రతి ఇంటికి డబుల్ బెడ్ రూమ్ వచ్చేలాగా చేస్తానని వాగ్దానం చేసి గద్దినెక్కడo జరిగింది మీరు ఇచ్చిన హామీ ప్రకారం మాట నిలబెట్టుకోవాలని కచ్చితంగా అర్హులైన పేదలకు స్థానికులకే ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమoలో వచ్చిన ఒక మహిళ మాట్లాడుతూ నేను నిరుపేద రాలిని నాకు సొంత ఇల్లు లేదు కేవలం 5000 జీతంతో బ్రతుకుతున్నాను భర్త ఇద్దరు పిల్లలు భవిష్యత్తులో మా పరిస్థితి ఏంటి? ఇల్లు కట్టుకోవడానికి కనీసం ఖాళీ స్థలం కూడా లేదు డబల్ బెడ్ రూమ్ ఇస్తారని 8 ఏళ్ల నుండి రోజు ఎదురుచూస్తున్నాను అని కన్నీరు పెట్టుకున్నారు నిజంగా నిరుపేదలైన అసలు సొంతిల్లు లేని పేద మహిళలు పాల్గొని వారి పరిస్థితులను చెప్తుంటే వారి బాధ హృదయ విదారకంగా ఉందని ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లేని ఎడల రానున్న రోజుల్లో ఎమ్మెల్యే ఎక్కడ తిరిగినా ప్రజలతో కలిసి మిమ్మల్ని వెంటపడి తరుమాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు ఏ మల్లేష్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి డి విగ్నేశ్వర్, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి గోనె మల్లారెడ్డి,ఏ శ్రీనివాస్ యాదవ్ డి ప్రభాకర్ రెడ్డి, సీతారాం రెడ్డి,ఆకుల మల్లేష్,ఆకుల విజయ్, రోజా,ఎం జంగారెడ్డి,బీ వీరేష్ కుమార్,భాస్కర్ నాయక్ మురళిదర్ బాబు, అతీష్ బాబు,లక్ష్మరెడ్డి,కొమ్ము ప్రశాంత్, నవీన్ అనిల్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు