నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ లొ ‘బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం

Spread the love

‘Bathukamma saree distribution program’ in Nizampet Municipal Corporation 13th Division

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ లొ ‘బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ..

బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి తెలంగాణ ఆడపడుచుకు మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ లో ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ఎన్ ఎమ్ సి తెరాస పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ , స్థానిక కార్పొరేటర్ ఆవుల పావని జగన్ యాదవ్ తో కలిసి మహిళా మణులకు చీరలు పంపిణీ చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ మన ప్రభుత్వం బతుకమ్మ పండగను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రతి ఇంటి ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా నేడు చీరలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికీ చీరలు అందేవిధంగా ఏర్పాటు చేస్తామన్నారు

.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్ ,యువ నాయకులు ఆనంద్ రెడ్డి,ఎన్ ఎమ్ సి బిసి సెల్ ఉపాధ్యక్షులు సాయి ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి దశరథ్, సూపర్వైజర్ ప్రశాంత్, కాలనీ వాసులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page