మహిళల రక్షణ చట్టాలకై బాలికలకు అవగాహన కార్యక్రమంహుస్నాబాద్ ఎస్ఐ తోట మహేష్

Spread the love

సాక్షిత – హుస్నాబాద్ (సిద్దిపేట బ్యూరో చీఫ్ )
హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో ఉన్న తెలంగాణ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినిలకు మహిళల రక్షణ గురించి ఉన్న చట్టాల గురించి సిద్దిపేట షీ టీమ్స్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం హుస్నాబాద్ ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఎస్ఐ మాట్లాడుతూ హుస్నాబాద్ సోషల్ మీడియా దాని ప్రభావం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ బాల్య వివాహాలు ఫోక్సో చట్టాలు అపరిచిత వ్యక్తుల పట్ల ఎలా ఉండాలి

రోడ్డు ప్రమాదాలు మైనర్ డ్రైవింగ్ సమాజంలో జరుగుతున్న నేరాలు సమాజ రుక్మతల గురించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, విద్యా దాని యొక్క ప్రాముఖ్యత, క్రమశిక్షణ, మరియు ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100కు డయల్ చేయాలని సిద్దిపేట షిటీమ్ వాట్సప్ నెంబర్ కు 8712667343 స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్ 9494639498, మహిళా పోలీస్ స్టేషన్ సిద్దిపేట 8712667435 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని హుస్నాబాద్ ఎస్ఐ తోట మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ శ్రీనివాస్ అధ్యాపకులు హుస్నాబాద్ డివిజన్ షీటీమ్ ఏఎస్ఐ మల్లేశం కానిస్టేబుళ్లు దుద్యానాయక్ మహేష్, మహిళా కానిస్టేబుల్ స్వప్న, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.

Related Posts

You cannot copy content of this page