తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శేరిలింగంపల్లి ప్రభుత్వ పాఠశాలలో

Spread the love

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు , మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శేరిలింగంపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన విద్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధులుగా జిహెచ్ఎంసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని శేరిలింగంపల్లి ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉచిత పాఠ్య పుస్తకాలను, నోట్ బుక్స్, స్కూల్ యూనిఫామ్స్ ను విద్యార్థిని, విద్యార్థులకు పంపిణీ చేసారు.

ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలో రాష్ట్రం అడుగుపెడుతున్న తరుణంలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్య దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరికి దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది సంవత్సరాలలో ఎన్నో అద్భుతాలు సృష్టించిందని మంచినీటి, త్రాగునీటి, కరెంటు తదితర వ్యవస్థను ఎలాంటి సమస్య లేకుండ శాశ్వత పరిష్కారంగా తీర్చిదిద్దని అన్నారు. విద్యార్థులు మంచి విద్యను అభ్యశించి భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని, ఒక IAS, IPS, డాక్టర్, ఇంజనీర్, లాయర్, పొలిటికల్ లీడర్ అవ్వాలని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ZPHS HM శంకర్, సీనియర్ నాయకులు మిరియాల రాఘవ రావు, ఉపాధ్యాయులు బలరామ్, బల్వంత్ రెడ్డి, గోపాల్, రమేష్, వెంకటేశ్వర్లు, భాస్కర్ యాదవ్, రాజయ్య, సుధీర్ బాబు, శివ కుమార్, అనంతయ్య, కేశవ రెడ్డి, షమీమ్ రుక్సానా, ఉదయ కుమారి, పాఠశాల విద్యార్థి విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page