తప్పులు లేని ప్రత్యేక ఓటర్ల సవరణ ముసాయిదా జాబితా తయారు కావాలి

Spread the love

An error-free amended draft list of special electors should be prepared

తప్పులు లేని ప్రత్యేక ఓటర్ల సవరణ ముసాయిదా జాబితా తయారు కావాలి: అనుపమ అంజలి

తిరుపతి,డిసెంబర్16: తప్పులు లేని ప్రత్యేక ఓటర్ల సవరణ ముసాయిదా జాబితా తయారు కావాలి అని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు.

స్థానిక ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో శుక్రవారం ఉదయం ఈ ఆర్ ఓ మరియు మునిసిపల్ కమీషనర్ వారు డిప్యూటీ కమీషనర్, తసిల్దార్ అర్బన్ లతో కలిసి ఉదయం 10 గంటలకు నిర్వహించిన ఎస్ ఎస్ ఆర్-2023 పై బి ఎల్ ఓ లతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

ఇందులో బి ఎల్ ఓ లు క్షేత్ర స్థాయిలో నివేదికలు తప్పులు లేని ఓటరు జాబితా ఉండాలని, ఈపీ నిష్పత్తి, ఫారం 6, 7, 8 క్లైమ్ల పరిష్కారం 20 వ తేదీలోపు పూర్తి చేయాలని, ఒకే విధమైన ఫోటోలు గల ఎంట్రీలు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం లో 20440 ను మూడు రోజులలోపు పరిష్కరించాలని, ఆధార్ అనుసంధానం మరియు ఫారం 6బి లో పురోగతి 60శాతం పైగా సాధించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి తిరుపతి అర్బన్ తాసిల్దార్ వెంకటరమణ, బిఎల్ ఓ లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page