పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌళిక వసతుల కల్పన చేయాలి

Spread the love

పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌళిక వసతుల కల్పన చేయాలి
-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్


సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్
పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌళిక వసతుల కల్పన చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. కలెక్టర్ ఖమ్మం రూరల్ మండలంలోని పెద్దతాండ మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల, మద్దులపల్లి మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల, పొన్నెకల్ కేంద్ర ప్రాథమికోన్నత పాఠశాలలను సందర్శించి, పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్ తదితర అన్ని మౌళిక సదుపాయాలు వుండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా లేనిచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు అవసరమున్నచోట పెయింటింగ్ వేయాలని, టాయిలెట్లలో రన్నింగ్ వాటర్ ఉండాలన్నారు. ఫ్యాన్లు, లైట్లు సరిపోను వుండేలా చర్యలు చేపట్టాలన్నారు. భద్రతాపరంగా చర్యలు తీసుకోవాలని, కాంపౌండ్ వాల్ లేని పోలింగ్ కేంద్రాలకు వెంటనే కాంపౌండ్ వాల్ ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు. స్వీప్ కార్యాచరణ లో భాగంగా కాంపౌండ్ గోడలపై ఓటరు అవగాహనకు సంబంధించి నినాదాలు వ్రాయించాలన్నారు. భద్రత పరంగా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల విధుల సిబ్బందికి వసతికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ప్రజలకు పాఠశాలను చూడగానే, ఇందులో పోలింగ్ కేంద్రం ఉన్నదనే ప్రత్యేకత కనిపించాలని కలెక్టర్ అన్నారు.

 కలెక్టర్ తనిఖీ సందర్భంలో ఎస్డీసి ఎం. రాజేశ్వరి, పీఆర్ ఎస్ఇ చంద్రమౌళి, ఇఇ వెంకట్ రెడ్డి, విద్యాశాఖ ఇఇ నాగశేషు, ఖమ్మం రూరల్ ఎంపిడివో ఎస్. కుమార్, తహసీల్దార్ రాంప్రసాద్, మండల విద్యాధికారి శ్యాoసన్, అధికారులు తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page