స్థానికులకు డబుల్ బెడ్రూం లు కేటాయించిన తరవాతే ఇతరులకు కేటాయించాలి.

Spread the love

పురపాలక శాఖ మంత్రి కే‌టి‌ఆర్ డబుల్ బెడ్రూం పంపిణీ కార్యక్రమంలో ముందుగా స్థానిక గ్రామాల వారికి ముందుగా చెప్పిన విధంగా పది శాతం పంపిణీ చేసిన తరవాతనే ఇతరులకు పంపిణీ చేయాలని టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి డిమాండ్ చేశారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సుమారుగా లక్షకు పైగా పేద ప్రజలు డబుల్ బెడ్రూం కొరకు అప్లికేషన్లు పెట్టుకున్నారని,ముందుగా వారికి ఇక్కడ కట్టిన డబుల్ బెడ్రూంలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎంతో మంది దళితులు,రైతుల భూములు తీసుకుని డబుల్ బెడ్రూంలు నిర్మించారని,ఇప్పుడు కేటాయింపుల విషయంలో వారికి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని,వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
డబుల్ బెడ్రూంల కేటాయింపు విషయంలో స్థానికులకు అన్యాయం జరిగితే కే‌టి‌ఆర్ ని,స్థానిక ఎమ్మెల్యే ని అడ్డుకోవడానికి కూడా కాంగ్రెస్ శ్రేణులు సిధ్హంగా ఉన్నారని హెచ్చరించారు.
అదే విధంగా దళిత బంధు లబ్దిదారుల ఎంపికలో సొంత పార్టీ నేతలు,కార్యకర్తలకు కాకుండా అర్హులైన దళితులందరికీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు.

అదే విధంగా దళిత బందు లబ్దిదారుల ఎంపికలో అర్హులైన దళితులకు కాకుండా అధికార పార్టీ నేతలకు,కార్యకర్తలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని,అర్హులైన దళితులకు వెంటనే దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజనోళ్ల లక్ష్మి,దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి,కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వొంపుగూడెం రాజిరెడ్డి,దుండిగల్ మున్సిపాలిటీ ఓ‌బి‌సి సెల్ అధ్యక్షులు కుమార్ యాదవ్,దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతకింది సురేశ్,దుండిగల్ మున్సిపాలిటీ ప్రధాన్ కార్యదర్శులు అర్కల విజయ్ గౌడ్,సాధు యాదవ్,పరశురాం గౌడ్,అసెంబ్లీ కో ఆర్డినేటర్ బత్తుల చిరంజీవి,దుబాయ్ మల్లారెడ్డి,చెవిటి శ్రీనివాస్,యెల్లేష్,నరేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page