60 లక్ష రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
నరసరావుపేట పట్టణంలోని సుమారు 60 లక్షల రూపాయల వ్యయంతో 26, 27, 28వ వార్డుల్లోని శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదగా పార్టీ నేతలతో మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి పలు వార్డుల్లోని సీ.సీ రోడ్డు, సైడ్ డ్రైనేజీలు, వాటర్ లైన్, బోరింగ్లు, ఐమాక్స్ లైటింగ్, కల్వర్టుల, పలు శంకుస్థాపన కార్యక్రమములు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పలు మరమత్తు పనులను పరిశీలించిన డా౹౹గోపిరెడ్డి పలు సూచనలు చేశారు..
ఈ సందర్భంగా డా౹౹గోపిరెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రజలకు అవసరమైన అన్ని వసతులను కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు. నరసరావుపేట పట్టణంలో అన్ని వార్డులలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యమిస్తున్నామని.. ముఖ్యంగా సిసి రోడ్లు, డ్రైనేజీలను ప్రాధాన్యత క్రమంలో నిర్మిస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అధికారులు మరి స్థానిక ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు కేటాయించి పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ వార్డు ఇంచార్జ్ లు మునిసిపల్ సిబ్బంది మరియు వార్డు సచివాలయ సిబ్బంది పలువురు అధికారులు పాల్గొన్నారు..