చిలుకూరు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం.
సాక్షిత ప్రతినిధి చిలుకూరు సూర్యపేట జిల్లా, :సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం చిలుకూరు గ్రామంలోని నేషనల్ హైవే 167 కోదాడ టు హుజూర్నగర్ రోడ్డు లో కటకమ్మ గూడెం కాలవడ్డులో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసం మొదటి నాగుల చవితి సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం 3 గంటల నుండి పుట్టలకు పాలు పోసి నాగేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి అన్నదాన కార్యక్రమం నిర్వహణలో భాగంగా సంక్రాంతి శ్రీనివాసరావు జ్ఞాపకార్థం కుమార్తె శ్రీలత, కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ,సంక్రాంతి ఫౌండేషన్ ద్వారా గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. కోరిన కోరికలూ తీర్చే శ్రీ అభయాంజనేయ స్వామి కార్తీక మాసంలో పూజ చేసే ప్రతి భక్తుడు యొక్క కోరిక తీర్చాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ సంక్రాంతి లక్ష్మీనారాయణ,సంక్రాంతి లక్ష్మయ్య, కరుణాకర్, రాజశేఖర్, విజయ శేఖర్ ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
చిలుకూరు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం.
Related Posts
బన్నీ ఫ్యాన్స్‌కు మెంటలెక్కించే అప్డేట్… ఆ థియేటర్లో పుష్ప2 చూడబోతున్న అల్లు అర్జున్..!
SAKSHITHA NEWS బన్నీ ఫ్యాన్స్‌కు మెంటలెక్కించే అప్డేట్… ఆ థియేటర్లో పుష్ప2 చూడబోతున్న అల్లు అర్జున్..!! ఎప్పుడెప్పుడు షో మొదలవుతుందా… అల్లు అర్జున్ను బిగ్ స్క్రీన్‌పై చూస్తామా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఏ థియేటర్ దగ్గర…
పెద్దపల్లి జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు
SAKSHITHA NEWS పెద్దపల్లి జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు పెద్దపల్లి జిల్లా:పెద్దపల్లి జిల్లా పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,సీఎం రేవంత్ రెడ్డి, వరాల జల్లు కురిపించారు.ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన యువ వికాసం విజయో…