పోలీస్ శిక్షణకు వెళ్తున్న 158 స్టైఫండరీ పోలీసు కానిస్టేబుళ్లు.

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం :
పోలీస్ శాఖలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వాన్ని కలిగి వుండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. తెలంగాణ పోలీస్ నియామక మండలి ద్వారా ఎంపికైన వారిలో తొమ్మిది నెలల శిక్షణ కోసం పోలీస్ శిక్షణ కేంద్రాలకు వెళ్ళుతున్న 158 మంది సివిల్/ఏఆర్ స్టైఫండరీ ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుళ్ళకు పోలీస్ ఐడెంటిఫికేషన్ కార్డు, కిట్ అ‍ర్టికల్స్ ను పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ కమిషనర్ అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ…. .
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా క్షేత్రస్ధాయిలో ప్రజలకు సేవలందించే రీతిలో ఇచ్చే తొమ్మిది నెలల పోలీస్ శిక్షణ కాలాన్ని చక్కని ఆవకాశంగా భావించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. శిక్షణ ప్రారంభంలో కుటుంబ సభ్యులతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకొని భావోద్వేగాలకు గురికాకుండా మానసిక బలం కలిగి వుండాలని సూచించారు. ఏదైనా సమస్య వుంటే తోటి వారితో పంచుకోవడం ద్వారా మానసిక ప్రశాంత కలిగి వుంటుందని అన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి సమస్య వచ్చిన సమర్థవంతంగా ఎదుర్కోనేలా తొమ్మిది నెలలలో శిక్షణ పొందలన్నారు.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోలీస్ శాఖలోని వివిధ విభాగాలలో ఎంపికైన అభ్యర్థులకు పోలీస్ కానిస్టేబుల్ నియామక పత్రాలు అందజేసిన నేపథ్యంలో
ఖమ్మం పోలీస్‌ కమిషనరేట్‌ నుండి శిక్షణకు వెళ్తున్న158 మందిలో 54 మంది సివిల్‌ ట్రైనీ కానిస్టేబుళ్ళు, 55 మంది ఆర్మూడ్‌ రిజర్వ్‌ కానిస్టేబుళ్ళు వున్నారన్నారు. అలాగే 33 మంది మహిళ సివిల్‌ కానిస్టేబుళ్ళు,16 మంది మహిళా ఆర్మూడ్‌ రిజర్వ్‌ ట్రైనీ కానిస్టేబుళ్ళు వున్నారన్నారు. వీరందరికి తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీతో పాటు, పిటిసి వరంగల్, సిటిసీ సైబరాబాద్, 8వ బెటాలియన్‌ల్లో తొమ్మిది నెలల శిక్షణ ఇవ్వనునట్లు తెలిపారు
కార్యక్రమంలో సీసీఆర్బీ ఏసీపీ గణేష్, ఏవో అక్తరూనీసాబేగం, ఆర్ ఐ లు కామరాజు , శ్రీశైలం, అప్పలనాయుడు, సిఐ అంజలి, సిఐ స్వామి, సిఐ వెంకన్న, సెక్షన్ సూపరిండెంట్ జానకి రామ్ పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page