ఘన స్వాగతం పలికిన మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

Spread the love

గౌరవ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి ఘన స్వాగతం

ఘన స్వాగతం పలికిన మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.

గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయం నుంచి భారీ ర్యాలీ

ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి, 3.4.2023.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో కంటైనర్ విద్యుత్తు ఉపకేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఏపీ విద్యుత్తు, గనుల శాఖామాత్యులు గౌరవ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మైలవరం నియోజవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.

ముందుగా గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయానికి చేరుకున్న మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు ఘనంగా స్వాగతించారు.

ఈ సందర్భంగా జరిగిన భేటీలో నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని సేవలందిస్తూ, జగనన్న స్పూర్తితో నిజాయితీగా పాలన కొనసాగిస్తున్న శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారిపై గౌరవ మంత్రి గారు ప్రశంసల జల్లు కురిపించారు.

ఇక్కడినుండి భారీ ర్యాలీగా శ్రీనివాసనగర్ లో కంటైనర్ విద్యుత్ ఉపకేంద్ర ప్రారంభోత్సవానికి తరలి వెళ్లారు. ఎంతో శోభాయమానంగా జరిగిన ఈ ర్యాలీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page