చిన్న దొర తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడా?: వైఎస్ షర్మిల

Spread the love

Where are you in Telangana Movement?: YS Sharmila

చిన్న దొర తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడా?: వైఎస్ షర్మిల

చిన్న దొర తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడా ? అంటూ వైఎస్ షర్మిల సెటైర్లు పేల్చారు.ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ కు కౌంటర్ వేశారు వైఎస్ షర్మిల.వచ్చిన తెలంగాణలో,కొట్లాడిన ఉద్యమకారులను ఆదుకోవడంలో నువ్వెక్కడ?నీ జాడెక్కడ? అంటూ నిలదీశారు. కొలువుల కోసం ఆత్మహత్య చేసుకొన్న నిరుద్యోగ కుటుంబాలను ఆదుకోవడంలో నువ్వెక్కడ?నీ జాడెక్కడ ? అని ప్రశ్నించారు.

పంటలు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవడంలో నువ్వెక్కడ?నీ జాడెక్కడ? పోడు పట్టాల కోసం ఆదివాసీల మీద దాడులు జరిగితే నువ్వెక్కడ?నీ జాడెక్కడ?అని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.వరద ప్రాంతాలను సందర్శించి, రోడ్డున పడ్డ కుటుంబాలకు సాయం అందించడంలో నువ్వెక్కడ?నీ జాడెక్కడ? దీక్షలు చేసే విఆర్ఏ ల పోరాటంలో ఉపాధ్యాయుల స్పౌజ్ బదిలీల పోరాటంలో నువ్వెక్కడ?నీ జాడెక్కడ? అని నిప్పులు చెరిగారు.


కరోనాతో కుటుంబపెద్దను కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో నువ్వెక్కడ?నీ జాడెక్కడ? అధికారంలో ఉండి సమస్యలు పరిష్కరించకుండా,జనాన్ని చచ్చేలా చేస్తున్న కేటీఆర్ మీరా?అని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.నన్ను నువ్వెక్కడా అని ప్రశ్నించేది?అధికారం లేకున్నా ప్రజలకు అండగా ఉండటంలో నేనున్నా! అంటూ షర్మిల భరోసా కల్పించారు.

Related Posts

You cannot copy content of this page