గుడ్లవల్లేరు మండలం రెడ్డిపాలెం దగ్గర అమరావతి రైతులకు స్వాగతం

Spread the love

Welcome to Amaravati Farmers near Reddypalem, Gudlavalleru Mandal

గుడ్లవల్లేరు మండలం రెడ్డిపాలెం దగ్గర అమరావతి రైతులకు స్వాగతం పలికేందుకు వేచియున్న టీమ్ శిష్ట్లా లోహిత్ సభ్యులు
మహా పాదయాత్రగా గుడివాడ నియోజకవర్గంలోకి ప్రవేశించిన అమరావతి రైతులకు స్వాగతం పలుకుతున్న టీమ్ శిష్ట్లా లోహిత్ బృందం


అమరావతి రైతులతో కలిసి పాదయాత్ర చేస్తున్న దృశ్యం

  • మహా పాదయాత్రకు టీమ్ శిష్ట్లా లోహిత్ బృందం సంఘీభావం
  • గుడివాడ నియోజకవర్గంలో యాత్రకు ఘన స్వాగతం పలికిన సభ్యులు
  • మూడు రోజులు కొనసాగనున్న మహాపాదయాత్ర
  • మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి
  • తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

గుడివాడ, : అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న అమరావతి టు అరసవెల్లి మహా పాదయాత్రకు టీమ్ శిష్ట్లా లోహిత్ సభ్యులు సంఘీభావం తెలిపారు. శుక్రవారం మచిలీపట్నం హుస్సేన్ పాలెంలోని హర్ష కళాశాల దగ్గర నుండి మహా పాదయాత్ర ప్రారంభమైంది. గుడ్డవల్లేరు మండలం రెడ్డిపాలెం గ్రామం దగ్గర గుడివాడ నియోజకవర్గంలోకి ప్రవేశించిన మహా పాదయాత్రకు టీమ్ శిష్ట్లా లోహిత్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా భారీ పాదయాత్రగా తరలి వచ్చిన రైతులతో కలిసి టీమ్ శిష్ట్లా లోహిత్ సభ్యులు కూడా మద్దతుగా పాల్గొన్నారు. ఈ మహా పాదయాత్ర రెడ్డిపాలెం నుండి వడ్లమన్నాడు గ్రామానికి చేరుకుంది. భోజనం విరామం తర్వాత అక్కడి నుండి యాత్ర ప్రారంభమై కవుతరం గ్రామం వరకు సాగింది.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ అమరావతి రైతులకు మద్దతుగా
టీమ్ శిష్ట్లా లోహిత్ బృందం మహా పాదయాత్రలో పాల్గొనడం జరిగిందన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న అమరావతి టు అరసవెల్లి మహా పాదయాత్రకు
టీమ్ శిష్ట్లా లోహిత్ బృందం స్వాగతం పలకడం జరిగిందన్నారు.


రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అమరావతి అని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియచెప్పేందుకే అమరావతి రైతులు మహా పాదయాత్రను చేపట్టారని తెలిపారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా అమరావతిని అభివృద్ధి చేయాలని ఆదేశించిందని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం నుండి వైఖరితో వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని శిష్ట్లా లోహిత్ డిమాండ్ చేశారు

.
అనంతరం టీమ్ శిష్ట్లా లోహిత్ బృందం సభ్యుడు కట్టా కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాజధాని రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపామని చెప్పారు. శిష్ట్లా లోహిత్ అదేశాల మేరకు గుడివాడ నియోజకవర్గంలోకి ప్రవేశించిన మహా పాదయాత్రకు ఘన స్వాగతం పలికామని తెలిపారు

. నియోజకవర్గం లో మూడు రోజులపాటు జరిగే పాదయాత్రలో పాల్గొని తమ వంతు సహకారాన్ని అందజేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అమరావతి అని ప్రభుత్వానికి తెలియజేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీమ్ శిష్ట్లా లోహిత్ బృందం సభ్యులు కట్టా సాంబశివరావు, భాస్కరరావు, నాగరాజు, దుర్గారావు, రాము, శ్రీనివాసరావు, చంటి, అశోక్, జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page