పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన విజయశాంతి పాతికేళ్ల రాజకీయ ప్రస్థాన కార్యక్రమం

Spread the love

Vijayashanti Patikella’s political predominance program was grandly organized at the party office

సైద్దాంతిక భావాలున్న నాయకులారా….

బీజేపీలోకి తిరిగి రండి

అందరం కలిసి కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడదాం

కార్యకర్తలు ప్రధాని, రాష్ట్రపతి అయ్యే అవకాశాలుండేది బీజేపీలోనే

నేను తప్పు చేసినా అడిగే హక్కు కార్యకర్తలకు ఉంది

బీఆర్ఎస్ పార్టీలో ఆ పరిస్థితి ఉంటుందా?

విజయశాంతి చివరి మజిలీ బీజేపే కావాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన విజయశాంతి పాతికేళ్ల రాజకీయ ప్రస్థాన కార్యక్రమం

హాజరైన తరుణ్ చుగ్, కిషన్ రెడ్డిసహా పలువురు నాయకులు

‘‘చిన్న చిన్న సమస్యలకు ఇబ్బందిపడి భావోద్వేగాలతో బీజేపీకి దూరమైన వారిని నేను ఒక్కటే కోరుతున్నా… సైద్దాంతిక భావాలుండి పార్టీని వీడిన వారంతా బీజేపీలోకి రావాలని కోరుతున్నా… అందరం కలిసి కేసీఆర్ నియంత పాలనపై పోరాడతాం. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకుందాం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

• బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాయలంలో నిర్వహించిన కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, తమిళనాడు సహాయ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, జి.వివేక్, మాజీమంత్రి బాబూమోహన్, మాజీ ఎంపీలు చాడా సురేష్ రెడ్డి, రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, రాణిరుద్రమ తదితరులు పాల్గొని విజయశాంతిని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు…
• సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు 25 ఏళ్లు రాజకీయాల్లో కొనసాగడం మామూలు విషయం కాదు. సినిమా గ్లామర్ ప్రపంచం. రాజకీయాల్లో ప్రశంసలకంటే విమర్శలే ఎక్కువ. అవన్నీ తట్టుకుని తెలంగాణ ఉద్యమకారిణి గర్జిస్తూ 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషం. ప్రత్యేక పరిస్థితుల్లో మధ్యలో పార్టీని వీడినప్పటికీ తిరిగి పార్టీలోకి వచ్చిన విజయశాంతి విజయశాంతికి చివరి మజిలీ బీజేపీయే కావాలి.

• బీజేపీలోనే కార్యకర్తల నుండి నాయకుల వరకు అన్ని అవకాశాలు వస్తాయి. ఛాయ్ వాలా ప్రధాని అయ్యారు. ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అయ్యారు.

• నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినైనా తప్పు చేస్తే అడిగే హక్కు కార్యకర్తలకు ఉంటుంది. నేను సరిజేసుకోకపోతే హైకమాండ్ కు చెప్పుకునే అవకాశం ఉంటుంది.

• ప్రాంతీయ పార్టీల్లో ఆ పరిస్థితి ఉండదు. కుటుంబ పార్టీల నాయకులే అధ్యక్షులు. అడిగే ధైర్యం కూడా ఉండదు.

• కొన్ని రాష్ట్రాల్లో రెండు తరాలుగా అధికారంలోకి లేకపోయినప్పటికీ కమిట్ మెంట్ తో పనిచేసే కార్యకర్తలున్నారు. అలాంటి కార్యకర్తలున్న పార్టీ బీజేపీ మాత్రమే.

• తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి విజయశాంతి. తెలంగాణ ఉద్యమస్పూర్తిని కొనసాగిస్తున్నారు. కేసీఆర్ తన యాస, భాష, జిమ్మిక్కులతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఏ ఆశయం కోసం తెలంగాణ సాధించుకున్నామో… ఆ ఆశయ సాధన కోసం మనమంతా పోరాడతాం.

• ఈ వేదిక నుండి నేను పిలుపునిస్తున్నా… చిన్న చిన్న సమస్యలకు ఇబ్బందిపడి, భావోద్వేగాలతో పార్టీని వీడిన వారు, సైద్దాంతిక భావాలున్న వారంతా బీజేపీలోకి రావాలని కోరుతున్నా… అందరం కలిసి కేసీఆర్ నియంత పాలనపై పోరాడతాం… లేకుండా ప్రజలు భిక్షమెత్తుకునే పరిస్థితి ఉంటుంది.

కిషన్ రెడ్డి
25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా విజయశాంతికి హ్రుదయపూర్వక శుభాకాంక్షలు. బీజేపీలో చేరిన తరువాత రాష్ట్రమంతటా విస్త్రతంగా పర్యటించారు. ఎక్కడికి వెళ్లినా వేలాది మంది తరలివచ్చారు. నా ఎన్నికల సభలో కూడా పాల్గొన్నారు. విజయశాంతి అంటే మహిళలకు ప్రత్యేకంగా అభిమానం. పార్లమెంట్ లో కేసీఆర్ లేకపోయినా తెలంగాణ బిల్లు మద్దతు పలికారు. ఎవరికీ తలవంచకుండా విజయశాంతి పనిచేశారు. విజయశాంతి బీజేపీలోనే 50 ఏళ్ల ప్రస్తానాన్ని పూర్తి చేసుకోవాలని కోరుతున్నా.
తరుణ్ చుగ్
ఈరోజు విజయశాంతి 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుండి నేను, కిషన్ రెడ్డి వచ్చాం. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడేందుకు విజయశాంతి ఎంతో పోరాటం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ వాడుకుని వదిలేసింది. విజయశాంతి మరింతగా రాజకీయాల్లో రాణించాలని, మరో పాతికేళ్లు రాజకీయాల్లో కొనసాగాలని ఆకాంక్షించారు.

విజయశాంతి
25 ఏళ్ల రాజకీయం… చాలా పెద్ద ప్రయాణం. 1998 జనవరి 21న వాజ్ పేయి, అద్వానీలను కలిశాను. నాకు బీజేపీ సిద్ధాంతాలు నచ్చాయి. కరప్షన్ లేని, క్రమశిక్షణ కలిగిన పార్టీ ప్రజలకు మేలు చేస్తుందని నా నమ్మకం. తెలంగాణలో జరిగిన అన్యాయంపై పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చాను. నాకు పదవులపై ఆశ లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే కోరికే ఉండేది. ఆ రోజు సమైక్యవాద నాయకులు తెలంగాణ రాకుండా అడ్డుకున్నారు.

అందుకే సమైక్యవాదులతో పోరాడేందుకు తల్లి తెలంగాణ పార్టీ పెట్టాను. ఆరోజు పార్టీని వీడినందుకు ఏడ్చాను. నాలుగున్నరేళ్లు పార్టీని నడిపి ఎన్నో సమస్యలపై పోరాడాను. ఆ సమయంలో ఒక రాక్షసుడు ఎదురయ్యాడు. తెలంగాణ పేరుతో ముసుగు కప్పుకుని వచ్చి నమ్మించి మోసం చేశారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి పూనుకున్నాడు. విలీనం చేసినప్పటి నుండి నేను ఏనాడూ ప్రశాంతంగా లేను. టార్చర్ అనుభవించాను. ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఓడగట్టేందుకు కుట్ర చేశారు. 2013లో తెలంగాణ రాష్ట్ర ప్రకటన రాగానే అదేరోజు రాత్రి నన్ను సస్పెండ్ చేశారు. నా తప్పేమిటో చెప్పలేదు.

నాకు విముక్తి కలిగినందుకు ఆనందం వ్యక్తం చేశానే తప్ప బాధపడలేదు. పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు తెలంగాణ రాకూడదనే కేసీఆర్ సహా చాలా మంది ఎంపీలు భావించారు. నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణకు సేవ చేసుకుంటా. ఈ ఒక్కసారి గట్టిగా పనిచేస్తే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ కు తెలంగాణపై ప్రేమ లేదు… తెలంగాణ సంపదపైనే కేసీఆర్ కన్నేశాడు…. ప్రజలు మేల్కోవాలి. మరోసారి అధికారం ఇచ్చారంటే అంతే..మీ భూములు లాక్కుంటారు.
బండి సంజయ్ నాయకత్వంలోనే మళ్లీ ఎన్నికల్లోకి పోతున్నాం.. మోదీ పీఎం అవుతారు. సంజయ్ నాయకత్వంలోనే బీజేపీ అధికారంలోకి వస్తుంది.


Spread the love

Related Posts

You cannot copy content of this page

virupaksha -వీరుపాక్ష SAKSHITHA NEWS LAILA – లైలా ANANYA RAJ – అనన్య రాజ్ RAJISHA VIJAYAN – రజిష విజయన్