SAKSHITHA NEWS

Thorough investigation in cases under investigation

దర్యాప్తులో ఉన్న కేసులలో సమగ్ర విచారణ చేపట్టి చట్టపరంగా నేరస్తులకు శిక్ష పడేవిదంగా కృషి చేయాలి

సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.

   జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ 

గద్వాల్: నేరాల‌ను నియంత్రించేందుకు ,సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్షపడి బాధితులకు న్యాయం జరిగేవిదంగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు.

ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో నెలవారి నేరసమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లాలోని పోలీస్టేషన్లలో పెండింగులో ఉన్న కేసులను వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకుని పెండింగులో ఉన్న కేసులను సత్వరమే పరిష్కారానికి కృషి చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.


ఈ నేర సమీక్ష సమావేశంలో అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సమగ్ర విచారణ ద్వార నిందితులకు శిక్షపడేవిధంగా చేసి బాధితులకు న్యాయం చేకూరేలా అధికారులు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అందుకు గాను ప్రతి SHO తమ పరిధిలోనీ గ్రేవ్ కేసుకు సంబంధించి బాధితులను, సాక్షులను కలిసి పరిస్ధితులు తెలుసుకోవాలని, వారికి కావాల్సిన సపోర్టు అందించాలని అన్నారు. అయా కేసుల్లో ట్రయల్ రోజు తప్పకుండా ShO, IO కోర్టు ను సందర్శించి సాక్షులను బ్రీఫింగ్ చేయలని ఆదేశించారు.


పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ త్వరితగతిన న్యాయస్థానం ద్వార తీర్పు వెలువడేలా చేసి శిక్షల రేటును పెంచాలని కోరారు.


పొక్సో కేసులలో సమగ్ర విచారణ చేపట్టి సరైన సాక్ష్యాధారాలను కోర్టు వారికి సమర్పించి నిందితులకు త్వరితగతిన శిక్షపడేలా కృషి చేయాలని కోరారు. వాహనదారులకు నిత్యం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ లను ధరిస్తూ కచ్చితంగా ట్రాఫిక్ నియమాలు పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.


పోలీస్ స్టేషన్ ల వారిగా వర్టికల్ పర్ఫామెన్స్ ను పరిశీలించారు.
జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ల పరిధిలో నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై మరియు ఓపెన్ ఏరియాలో మద్యం సేవించే వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


అన్ని పోలీస్టేషన్ల పరిధిలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఎవరైనా సైబర్ నేరాల బారినపడి నగదును కోల్పోతే వెంటనే ఫిర్యాదు చేసేలా జిల్లా ప్రజలందరికి అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి పిర్యాదుని చట్టప్రకారం పరిష్కరించి రిపోర్ట్ ను సెంట్రల్ కంప్లైంట్ సెల్ కు పంపాలని అన్నారు.
నేరాలు జరిగే ప్రదేశాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రదేశాలు హాట్ స్పాట్ గా గుర్తించి పాయింట్ బుక్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. డయల్ 100కాల్స్ ను నిర్ణీత సమయం లో సంఘటన స్థలానికి పోలీస్ సేవలు అందించాలని అన్నారు.


రౌడీలు, కేడీలు, సస్పెక్ట్స్ మరియు లాండ్ మాఫియా, ఇసుక మాఫియా, సంఘ విద్రోహ శక్తులపై నిరంతరం నిఘా ఉంచి,వారి కదలికలను గమనించాలని తెలిపారు.


చోరీ కేసులో నిందితులను కనిపెట్టి,చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేకూరేలా అధికారులు కృషి చేయాలని కోరారు. కమ్యూనిటీ పోలీస్ లో బాగంగా పట్టణాలలో, గ్రామాలలో సీసీ కెమెరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, సీసీ కెమెరాలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకునేల చూడాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి పిర్యాదు దారునితో సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. నెలలో రెండు సార్లు కమ్యూనిటీ కనెక్టివిటీ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని ఆదేశించారు.

ఈ సమవేశం జిల్లా డి. ఎస్పీ ఎన్. సి. హెచ్ రంగ స్వామి , గద్వాల్ సి.ఐ చంద్ర శేఖర్ , అలంపూర్ సి. ఐ సూర్య నాయక్ , శాంతినగర్ సి. ఐ శివ శంకర్ , ఎస్బి, డీసీ ఆర్బీఆ ఇన్స్పెక్ట ర్స్ శివ కుమార్ , శ్రీనివాస్ ఐటీ కోర్ టీమ్,DCRB స్టాఫ్, పోలీసు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS