మూడో విడత జగనన్న ఆసరా విడుదల

Spread the love

మూడో విడత జగనన్న ఆసరా విడుదల

ప్రకాశం జిల్లా…!!!!
పెద్ద దోర్నాల్లోని వైయస్సార్ కేపీ కార్యాలయం నందు APM పోలయ్య మాట్లాడుతూ ఈనెల 25వ తేదీన స్వయం సహాయక సంఘాలకు మూడో విడత జగనన్న ఆసరా విడుదల చేసినట్లు తెలియజేశారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన విధంగా స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకుని జగనన్న ఆసరా ఇచ్చారని పెద్దదోర్నాల మండలంలో మహిళల అభ్యున్నతి కోసం 573 గ్రూపుల గాను 5649 మంది సభ్యులకు 3,10,4,914/- రూపాయలను మంజూరు చేసినట్లు ఏపిఎం పోలయ్య తెలియజేశారు, ఈనెల 31వ తేదీన ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల కలిపి పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం లో ఈనెల 31వ తేదీన మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా స్వయం సహాయక సంఘాలకు అందివ్వనున్నట్లు ఏపీఎం పోలయ్య తెలియజేశారు, ఈ కార్యక్రమానికి పెద్ద దోర్నాల మండలంలోని సర్పంచులు జడ్పిటిసిలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఏపిఎం పోలయ్య తెలియజేశారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page