నూతనంగా చేపట్టబోయే అభివృద్ధి పనుల కొరకు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే

Spread the love

The MLA inspected the site for the new development works to be undertaken

నూతనంగా చేపట్టబోయే అభివృద్ధి పనుల కొరకు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్….

పటాన్చెరులోని పలు కాలనీలలో ఇటీవల ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నిర్ణయించిన నూతన అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు గాను శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మరియు SE శంకర్ నాయక్ తో కలిసి స్థల పరిశీలన చేశారు.

పఠాన్చెరు లోని పాత మార్కెట్ వద్ద గల వాటర్ ట్యాంక్ ను తొలగించి రైతుల మరియు స్థానిక ప్రజల మేలు కొరకు ఆ స్థలంలో రైతు బజార్ ను నిర్మించాలని ఎమ్మెల్యే నిర్ణయించగా ఆ స్థలాన్ని శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి పరిశీలించారు. త్వరలోనే మంచి నీటి ట్యాంకు ను కూల్చివేయలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

పటాన్చెరు లోని ముదిరాజ్ స్మశాన వాటికను మోడల్ గ్రేవ్ యార్డ్ చేయాలని ఎమ్మెల్యే నిర్ణయించగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి స్మశాన వాటిక స్థలాన్ని
పరిశీలించారు.

ఆల్విన్ కాలనీ మరియు బండ్లగూడకు చెందిన ప్రజలకు ఉపయోగకరంగా ఉండేందుకు ఆల్విన్ కాలనీ మల్లన్న గుడి వద్ద నూతన జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు స్థల పరిశీలన చేయడం జరిగింది.

అనంతరం బండ్లగూడలోని స్మశాన వాటికను కూడా మోడల్ గ్రేవ్ యార్డ్ చేసేందుకు స్మశాన వాటికను కార్పొరేటర్ గారితో కలిసి పరిశీలించారు.

Related Posts

You cannot copy content of this page