ప్రజలకు పోలీసులు అందుబాటులో భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యం

Spread the love

The main objective is to make the police accessible to the public and to protect them

ప్రజలకు పోలీసులు అందుబాటులో భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యం

నూతన రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి


సాక్షిత : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నూతన కమిషనర్ తెలియజేసారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్ గా నియమించబడిన రెమా రాజేశ్వరి ఐపిఎస్ బాధ్యతలు స్వీకరించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయమునకు చేరుకున్న నూతన పోలీస్ కమిషనర్ కు సాయుధ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. రామగుండం కమిషనరేట్ కు చెందిన పోలీస్ అధికారులు పోలీస్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకోని పుష్పాగుచ్చాలు అభినందనలు తెలిపారు.


అనంతరం పోలీస్ కమిషనర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ….. న్యాయాన్ని ధర్మాన్ని లోబడి చట్టబద్దంగా సామన్య ప్రజలకు నాతో పాటు మా అధికారుల చేత కూడ సేవలందిచడంలో కృషి చేస్తాను. రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని ఎసిపి లతో సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను, ఎక్కువ గా నమోదయి తో ఉన్నటువంటి కేసుల వివరాలను అడిగి తెలుసుకొవడం జరిగిందని,

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సామ్యాసుడిని దృష్టిలో పెట్టికోని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ వుంటుందని, శాంతి భద్రతల విషయంలోను కఠినంగా వుంటామని, ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకోని వ్యక్తిగత దూషణకు పాల్పడితే చర్యలు తప్పావని,

ఎవరైనా సామన్య ప్రజలను ఎవరైన వ్యక్తిగతంగా చేసుకోని సామాజిక మాధ్యమాల ద్వారా చేదు ప్రచారం చేసిన వ్యాక్యలు చేసిన వారిపై చర్యలు తప్పవని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా, విద్వేషాలను రెచ్చగోట్టేవారిని పట్ల కఠినంగా వ్యవహరిస్తామని నూతన పోలీస్ కమిషనర్ తెలియజేసారు.

నూతన బాధ్యతలు స్వీకరించిన పోలీస్ కమిషనరు ను కలిసి పుష్పాగుచ్చాలను అందజేసిన వారిలో ఏసిపిలు, ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఎస్.ఐ లు, సీపీ సిసి శ్రవణ్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచ లింగం, సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page