గుడివాడలో నాలుగో విడత ఆసరా కార్యక్రమం

Spread the love

5కోట్ల,62లక్షల ఆసరా చెక్కును ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని

-ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసిన నిబద్ధతగల నేత సీఎం జగన్…. ఎన్నికల తర్వాత హామీలను మర్చిపోయే మోసకారి చంద్రబాబు

-12వందల కోట్లతో వైఎస్ఆర్,సీఎం జగన్ 20వేల మంది గుడివాడ ప్రజల సొంతింటి కల నిజం చేశారు..

-చంద్రబాబు ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాలు నుండి తప్పకుంటా…. టిడిపి నేతలు తన సవాల్ స్వీకరించాలి

గుడివాడ :గుడివాడ టౌన్ మరియు రూరల్ మండలాల పరిధిలో నాలుగో విడత ఆసరా కార్యక్రమం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో వేలాదిమంది మహిళమ్మ తల్లుల సమక్షంలో ఘనంగా జరిగింది.మండల పరిధిలో గల 698 గ్రూపులలోని 6వేల,932 మంది సభ్యులకు విడుదలైన 5కోట్ల,62లక్షల,16వేల,923 రూపాయల ఆసరా జంబో చెక్కును ప్రజా ప్రతినిధులు, డ్వాక్రా సభ్యులతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించారు. తొలుత మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా సమైక్య నేతలు స్వర్గీయ వైయస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు నాలుగు విడతలుగా 25వేల,5వందల కోట్ల రుణమాఫీతో పాటు,
3వేల,5వందల కోట్ల సున్నా వడ్డీ సొమ్మును ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా సరే జమ చేసిన ఘనత సీఎం జగన్ దేనని కొనియాడారు.

స్వర్గీయ వైయస్సార్, సీఎం జగన్ గుడివాడలోని 20వేల మంది పేదల సొంతింటి కలను నిజం చేశారని ఎమ్మెల్యే నాని తెలియజేశారు.14ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ,పేదల ఇళ్ల కోసం ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొని ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. నిత్యం ఏదేదో మాట్లాడుతున్న టిడిపి నేతలు తన సవాల్ స్వీకరించాలని ఆయన చాలెంజ్ చేశారు. గుడివాడ ప్రజల దాహార్తిని తీర్చడానికి నాడు వైయస్సార్ 106 ఎకరాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకర్ నిర్మించారన్నారు. జగన్ హయాంలో నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకర్లు నిర్మితమవ్వగా, బ్యాలెన్స్ రిజర్వాయర్ నిర్మాణానికి 70 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కొడాలి నాని తెలియజేశారు. సీఎం జగన్ ప్రజలకు చేసిన మంచిని చూసి ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి,వైసిపి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో భాగంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎంపీపీ గద్దె పుష్పరాణి, వైస్ ఎంపీపీ బట్టు నాగ మల్లేశ్వరి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్, వైస్ చైర్మన్ చింతల భాస్కరరావు, మున్సిపల్ కమిషనర్ సుబ్రమణ్యం, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ పాలేటి చంటి,వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మెరుగు మాల కాళీ, రాష్ట్ర కార్యదర్శి అద్దేపల్లి పురుషోత్తం, వైద్య విభాగ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మలిరెడ్డి రవి,మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నీలాకాంత్, సంచార జాతుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ సయ్యద్, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణరెడ్డి, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు తోట మునిమ్మ,గుడివాడ అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి, మాజీ కౌన్సిలర్లు జ్యోతుల సత్యవేణి,అల్లం సూర్యప్రభ,సోషల్ మీడియా కన్వీనర్ తోట రాజేష్, వెంపల అప్పారావు మూడేడ్ల ఉమా, పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు,పలు ప్రభుత్వ శాఖల అధికారులు, వేలాదిగా స్వయం సహాయక సంఘాల మహిళలు, మండలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,మరియు అభిమానులు , సచివాలయ కన్వీనర్ లు , గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page