నేను ప్రచారం చేసిన కాంగ్రెస్ గెలవదు

Spread the love
The Congress I campaigned for will not win

నేను ప్రచారం చేసిన కాంగ్రెస్ గెలవదు..అవసరమైతే రిటర్మెంట్ తీసుకుంటా ‘


సాక్షిత హైదరాబాద్ణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్‌ కొనసాగుతున్న వేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోమటిరెడ్డి.. అక్కడ కాంగ్రెస్‌ కార్యకర్తలు, సన్నిహితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప​ ఎన్నికపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో నేను ప్రచారం చేసినా కాంగ్రెస్‌ గెలవదు. నేను ప్రచారానికి వెళ్తే మహా అంటే కొన్ని ఓట్లు వస్తాయి. కాంగ్రెస్‌ పార్టీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఇప్పటికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతంగా ఎంపీగా గెలిచాను. దాదాపు 25 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాను. ప్రస్తుత రాజకీయాల గురించి నాకు తెలుసు. అవసరమైతే రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటాను అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Related Posts

You cannot copy content of this page