SAKSHITHA NEWS

TDP has to come to power if the government is to be overthrown again in AP

ఏపీలో మళ్లీ పాలన గాడిన పడాలంటే టీడీపీ అధికారంలోకి రావల్సిందే

సోమిరెడ్డి, అజీజ్
సాక్షిత : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, రూరల్ నియోజకవర్గం ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో లెజెండ్రీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు.

రక్తదాన శిబిరాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షులు జెడ్ శివప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తలపాక అనురాధ, రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య లు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ…

నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఆయనకు నివాళులర్పిస్తున్నారు

ఎన్టీఆర్ అంటే రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన మహానాయకుడు

ఎలాంటి అనుభవం లేకుండానే రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు దేశంలో కాకలు తీరిన నేతలకు రాని వినూత్న ఆలోచనలు వచ్చాయి

కూడు, గూడు, గుడ్డ నినాదంతో పేద ప్రజల జీవితాల్లో సమూల మార్పులు తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దే

పక్కా ఇళ్ల నిర్మాణాన్ని దేశానికి పరిచయం చేసింది ఆయనే

పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేయడంతో పాటు మహిళలకు ఆస్తి హక్కు కల్పన, మండల వ్యవస్థ ఏర్పాటు, హార్స్ పవర్ రూ.50కే ఏడాదంతా కరెంట్, రైతులకు వడ్డీ రాయితీ, సామాజిక పింఛన్లు, వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాల సృష్టికర్త

ఏపీలో పరిస్థితులు మళ్లీ గాడిలో పడటం ఎన్టీఆర్ దీవెనలతో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం

ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ…

నందమూరి తారక రామారావు తాత ముత్తాతలు రాజకీయ నేపథ్యం కలిగిన వారు కాదని సమాజంలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని అన్నారు

ప్రజలకు ప్రాథమిక హక్కులు ఉండాలని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రోటీ కప్డా ఔర్ మకాన్ అన్న ఆలోచనను తెచ్చింది ఎన్టీఆర్ అని కొనియాడారు..

ప్రస్తుత రాజకీయాల్లో సంక్షేమం ఇస్తే అభివృద్ధి ఉండటం లేదని, ఎన్టీఆర్ సంక్షేమాన్ని అభివృద్ధిని ఒక సమతుల్యతతో పాటించేవారని అన్నారు..

ఎన్టీఆర్ నాగార్జున సాగర్ డ్యాం ను నిర్మించారని, హెల్త్, వెటర్నరీ యూనివర్సిటీలను స్థాపించారని యువతకు రైతులకు పేదవారికి అన్ని సమానంగా అందేలా చూసే వారని రాజు కు ఉండాల్సిన లక్షణాలు అవేనని అన్నారు…

ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కేవలం తెలుగుదేశం పార్టీ ఇదే కాదని ప్రతి యువకుడి పై అ బాధ్యత ఉందని ఉన్నారు.

ఆంధ్ర రాష్ట్రాన్ని రాక్షసుడి కబంధహస్తాల నుండి కాపాడుకోవాలంటే అందరం కలిసి పోరాడి చంద్రబాబు నాయుడు ను గెలిపించి ఎన్టీఆర్ కలలుగన్న ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి తెచ్చుకోవాలని అన్నారు.

కార్యక్రమంలో పనబాక భూలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు రాజా నాయుడు, పెంచలనాయుడు, సాబీర్ ఖాన్, జలదంకి సుధాకర్, గోడ పద్మ, అల్లా బక్షు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS