ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ, రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి

Spread the love

Take care of your health and do regular health checkups

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ, రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి
సాక్షిత గోదావరిఖని

   పెద్దపల్లి జిల్లా రామగుండం కమీషనరేట్లొ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్. (ఐజీ) పిలుపునిచ్చారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్ లో సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ మరియు హోంగార్డ్  సిబ్బందికి  వీక్లీ పరేడ్ శనివారం నిర్వహించడం జరిగింది. ఈ పరేడ్ కి రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్., (ఐజీ)  హాజరై గౌరవ వందనం  స్వీకరించారు.


 తరువాత సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్  ప్రదర్శనని పరిశీలించారు.ఈ సందర్బంగా తను మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ప్రతిరోజు ఉదయాన్నే కనీసం ఒక అరగంట యోగ, ధ్యానం, నడక ఏదో ఒకటి చేయాలని,  వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం అని, మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విదులు నిర్వహించడానికి ఫిజికల్ ఫిట్నెస్ తప్పనిసరి అని, సమయం దొరికినప్పుడు వ్యాయామం చేయాలని, ఫిట్నెస్ ను అనునిత్యం కాపాడుకోవాలన్నారు.


 పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాలన్నారు. రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ చేయించు కోవాలన్నారు. వ్యాయామాన్ని,  హెల్త్ చెకప్స్ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలన్నారు.కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్, ఏ.ఆర్. ఏసీపీ సుందర్ రావు, గోదావరిఖని 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్జాలోద్దీన్, ఆర్ఐ లు శ్రీధర్, విష్ణు ప్రసాద్, ఎస్ఐ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page