కాలనీల కాంటాక్ట్ కార్యక్రమం ను సద్వినియోగం చేసుకోండి మీ కాలనీల సమస్యలను పరిష్కరించుకోండి

Spread the love

*ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ *
సాక్షిత : మియాపూర్ డివిజన్ పరిధిలోని జనప్రియ వెస్ట్ సిటీ, స్టాలిన్ నగర్, KK ఎనక్లేవ్, గ్రీన్ వ్యాలీ, మక్తా మహబూబ్ పెట్, సత్యనారాయణ ఎనక్లేవ్, స్మైలీ ఎనక్లేవ్,లేక్ వ్యూ ఆ పార్ట్మెంట్స్, మియాపూర్ విలేజ్, ఫ్రెండ్స్ కాలనీ, ఆదిత్య నగర్, బాలాజీ నగర్,మయూరి నగర్, శ్రీల గార్డెన్స్, డోవ కాలనీ,అభయాంజనేయ కాలనీ లలో జరిగిన కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో డీసీ సుధాంష్ , కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మరియు సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో ,మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కాలనీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని, ప్రతి కాలనీ, బస్తీ, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లలో గల పలు సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా GHMC మరియు వివిధ ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రత్యేక్షంగా వెళ్లి సమస్యలు తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ను చేపట్టడం జరిగినది అని, కాలనీ లలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించడానికి చక్కటి వేదిక అని,ఇంచు మించు 15 డిపార్ట్మెంట్ అధికారులు ఒకే వేదిక ను పంచుకోవడం జరుగుతుంది అని ఆయా మీ కాలనీ సమస్యలను నేరుగా చెప్పుకోవడానికి ఇది ఒక చక్కటి కార్యక్రమం అని, ప్రతి కాలనీ వారు సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు, ఏప్రిల్ 15 వ తేదీ నుండి ప్రారంభించడం జరుగుతుంది అని కావున కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, కాలనీ ప్రతినిధులు,రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, సంఘ సేవకులు ప్రతి ఒక్కరు చక్కగా సద్వినియోగం చేసుకొని మన కాలనీ లను, మన ప్రాంతాలను ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు,ఈ చక్కటి కార్యక్రమంను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ,ప్రతి కాలనీ లో ప్రతినిధుల తో కార్పొరేటర్లు, అధికారులు సమన్వయం చేసుకొని సమస్యలు తెలుసుకొని ,త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలని, కాలనీ లలో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టి ప్రజా సమస్యలు పరిష్కారం గా ముందుకు వెళ్లాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీ లలో పారిశుధ్య నిర్వహణ పై అలసత్వం ప్రదర్శించారదని, రోడ్లు, డ్రైనేజి, మంచి నీటి సమస్య, నాల సమస్యలు, ఫూట్ ఫాత్, పార్క్ విధి దీపాలు, తడి చెత్త ,పొడి చెత్త నిర్వహణ, దోమల బెడద, కుక్కల బెడద రక్షణ చర్యలు, మహిళ సంరక్షణ చర్యలు, జ్వరం, ఆరోగ్య సమస్యలు, ట్రాఫిక్, పోలీస్ డయల్ 100, సైబర్ క్రైమ్, ఈవ్ టీజింగ్ , విద్యుత్ లైన్ లు వంటి వివిధ సమస్యల పై తెలుసుకొని త్వరితగతిన పరిష్కరిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ చక్కటి సదవకాశం ను ప్రతి కాలనీ వాసులు సద్వినియోగం చేసుకోవాలని తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో GHMC అధికారులు AMOH డాక్టర్ కార్తిక్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సంపత్, AE శివ ప్రసాద్, SI రవి కుమార్, జలమండలి మేనేజర్ సాయి చరిత, SRP కనకరాజు,మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కాలనీల అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page